Telugu Global
Cinema & Entertainment

Samyuktha Menon - ఈ సినిమా అనుకుంటే ఆ సినిమా వచ్చింది

Samyuktha Menon - తన టాలీవుడ్ డెబ్యూ చాలా విచిత్రంగా జరిగిందంటోంది మల్లూ బ్యూటీ సంయుక్త మీనన్.

Samyuktha Menon - ఈ సినిమా అనుకుంటే ఆ సినిమా వచ్చింది
X

సంయుక్త మీనన్.. తెలుగుతెరపైకి దూసుకొచ్చిన మరో మలయాళీ ముద్దుగుమ్మ. అయితే ఈమె టాలీవుడ్ ఎంట్రీ చాలా వినూత్నంగా జరిగింది. ఆమె ఒప్పుకున్న మొదటి తెలుగు సినిమా ఒకటి. కానీ ఆమె నుంచి రిలీజైన సినిమా ఇంకోటి. ఇంతకీ సంయుక్త మీనన్ ముందుగా ఒప్పుకున్న తెలుగు సినిమా ఏది?

"నేను తెలుగులో మొదట బింబిసార, ఆ తరువాత విరూపాక్ష సినిమా అంగీకరించాను. ఈ సినిమాలు విడుదలయ్యాక కొత్త సినిమాల గురించి ఆలోచించాలి అనుకున్నాను. కానీ ఇంతలో సితార బ్యానర్ లో భీమ్లా నాయక్ లో నటించే అవకాశమొచ్చింది. ఒరిజినల్ తో పోలిస్తే తెలుగులో నేను పోషించిన పాత్రలో చేసిన మార్పులు నచ్చి, వెంటనే ఆ సినిమా అంగీకరించడం జరిగింది. భీమ్లా నాయక్ షూటింగ్ సమయంలోనే నా నటన నచ్చి సితారలో మరో సినిమా అవకాశమిచ్చారు. అదే సార్ చిత్రం. డైరెక్టర్ వెంకీ కథ చెప్పగానే ఈ సినిమా కచ్చితంగా చేయాలి అనుకున్నాను. కథ చాలా బాగుంది, అందులో నా పాత్ర కూడా నచ్చడంతో వెంటనే అంగీకరించాను. ఆ తర్వాత లుక్ టెస్ట్ చేసి ఫైనల్ చేశారు."

ఇలా తన టాలీవుడ్ జర్నీని చెప్పుకొచ్చింది సంయుక్త మీనన్. ఇన్నాళ్లూ ఆమె ఒప్పుకున్న మొదటి సినిమా భీమ్లానాయక్ మాత్రమే అనుకున్నారు. కానీ బింబిసారతో ఆమె టాలీవుడ్ డెబ్యూ ఇవ్వాల్సింది. కానీ కరోనా వల్ల పరిస్థితులు మారిపోయాయి. బింబిసార బదులు, భీమ్లానాయక్ తో టాలీవుడ్ తెరపైకొచ్చింది.

First Published:  14 Feb 2023 5:49 PM GMT
Next Story