Telugu Global
Cinema & Entertainment

సముత్తరఖని కొత్త లుక్ అదిరింది

పవర్ ఫుల్ పొలిటీషియన్ గా సముత్తరఖని. మాచర్ల నియోజకవర్గం సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్.

సముత్తరఖని కొత్త లుక్ అదిరింది
X

హీరో నితిన్ చేస్తున్న పొలిటికల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ 'మాచర్ల నియోజకవర్గం'. ఆగస్ట్ 12న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రం ప్రచార కార్యక్రమాలు జోరుగా జరుగుతున్నాయి. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.

తాజాగా ఈ సినిమాలో విలన్ ని పరిచయం చేసింది చిత్ర యూనిట్. ''మాచర్ల నియోజకవర్గం' నుండి ఏకగ్రీవంగా ఎన్నికైన ఎమ్మెల్యే రాజప్ప పాత్రలో కనిపించబోతున్నారు విలక్షణ నటుడు సముద్రఖని. మాచర్ల నియోజకవర్గంలో రాజప్పకు ప్రతిపక్షమే లేదు.

నెరిసిన జుట్టు, మెలితిరిగిన మీసం, నుదుట తిలకం, మెడలో రుద్రాక్షమాలతో వింటేజ్ పొలిటిషియన్ లుక్ లో కనిపించిన సముద్రఖని పేపర్‌లపై సంతకం చేస్తూ సీరియస్‌ ఎక్స్‌ప్రెషన్స్ ఇచ్చారు. ఐఏఎస్ అధికారిగా నితిన్, ఎమ్మెల్యే మధ్య పోరు ఇందులో ఆసక్తికరంగా ఉండబోతోంది.

'మాచర్ల నియోజకవర్గం' సినిమా నుంచి ఇటీవల విడుదలైన ''రా రా రెడ్డి'' పాట ఇప్పటికీ యూట్యూబ్‌లో టాప్ ట్రెండింగ్‌లో ఉంది. నితిన్, అంజలి మాస్ డ్యాన్స్‌ అందరినీ అలరిస్తోంది. శ్రేష్ట్ మూవీస్ బ్యానర్‌పై నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాతో.. ఎంఎస్ రాజశేఖర్ రెడ్డి దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. కృతి శెట్టి, కేథరిన్ థ్రెసా హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకు మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్నాడు.





First Published:  14 July 2022 12:22 PM GMT
Next Story