Telugu Global
Cinema & Entertainment

Vimanam - సముద్రఖని విమానం టీజర్ ఎలా ఉందంటే?

Vimanam Movie Teaser - సముద్రఖని లీడ్ రోల్ పోషించిన సినిమా విమానం. ఈ సినిమా టీజర్ తాజాగా రిలీజైంది.చాలా ఎమోషనల్ గా ఉంది.

Vimanam - సముద్రఖని విమానం టీజర్ ఎలా ఉందంటే?
X

వీర‌య్య అంగవైక్య‌లంతో ఇబ్బంది ప‌డుతున్నా కొడుకుని మాత్రం ఎంతో ప్రేమ‌గా చూసుకుంటుంటాడు. వీర‌య్య కొడుక్కి మాత్రం ‘విమానం’ అంటే పిచ్చి. విమానం ఎక్కాల‌నే ఆలోచ‌న‌ల‌తో ఎప్పుడూ త‌న చుట్టూ ఉన్న‌వారిని ప్ర‌శ్నిస్తూనే ఉంటారు. తండ్రిని కూడా విమానం ఎక్కించ‌మ‌ని బ‌తిమాలాడుకుంటూ ఉంటాడు. బాగా చ‌దువుకుంటే నువ్వే విమానం ఎక్క‌ొచ్చని కొడుకుతో అంటుంటాడు వీర‌య్య‌. తండ్రీ కొడుకుల మ‌ధ్య అస‌లు ఈ విమానం గోల ఏంట‌నేది తెలుసుకోవాలంటే ‘విమానం’ సినిమా చూడాల్సిందేంటున్నారు మేక‌ర్స్‌. తాజాగా ఈ సినిమా టీజ‌ర్‌ లాంచ్ చేశారు.

టీజ‌ర్‌లో మాస్ట‌ర్ ధ్రువన్ కొడుకుగా న‌టిస్తే, తండ్రి పాత్ర‌లో విల‌క్ష‌ణ న‌టుడు స‌ముద్ర ఖ‌ని న‌టించారు. వీరి మ‌ధ్య సాగే విమానం సంభాష‌ణ ఆస‌క్తిక‌రంగా, ఫ‌న్నీగా ఉంది. అలాగే సినిమాలో బ‌ల‌మైన ఎమోష‌న‌ల్ అంశాలు కూడా ఉన్నాయి. ‘నాన్నా ఎప్పుడు దేవుడు క‌న‌ప‌డినా దండం పెట్టుకోమంటావు ఎందుకు’ అని అడిగిన కొడుకుతో ‘మనం అడిగినవన్నీ ఇస్తాడు’ కాబట్టి అని తండ్రి చెబుతాడు.

దానికి ఆ పిల్లాడు ‘అన్నీ ఇచ్చేవాడిని దేవుడు అనరు.. నాన్నా అంటారు’ అనే డైలాగ్.. టీజర్‌లో తండ్రీ కొడుకుల మధ్య ఉన్న భావోద్వేగ బంధాన్ని ఎలివేట్ చేసింది. ఈ ఎమోషనల్ జర్నీ జూన్ 9న ప్రేక్షకుల ముందుకు రానుంది.

‘విమానం’ చిత్రంలో వీర‌య్య అనే అంగ వైకల్యం ఉన్న తండ్రి పాత్ర‌లో స‌ముద్ర ఖ‌ని, కొడుకు పాత్రలో మాస్టర్ ధ్రువన్ న‌టిస్తుండగా సుమ‌తి పాత్ర‌లో అన‌సూయ భ‌ర‌ద్వాజ్‌, రాజేంద్ర‌న్ పాత్ర‌లో రాజేంద్ర‌న్‌, డేనియ‌ల్ పాత్ర‌లో ధ‌న్‌రాజ్‌, కోటి పాత్ర‌లో రాహుల్ రామ‌కృష్ణ ఇత‌ర కీల‌క పాత్ర‌ల్లో మెప్పించబోతున్నారు.



First Published:  14 May 2023 9:04 AM GMT
Next Story