Telugu Global
Cinema & Entertainment

యశోద టీజర్.. సమంత విశ్వరూపం

సమంత లీడ్ రోల్ పోషిస్తున్న సినిమా యశోద. తాజాగా ఈ సినిమా టీజర్ రిలీజైంది. అది ఎలా ఉందో చూద్దాం..

యశోద టీజర్.. సమంత విశ్వరూపం
X

లాంగ్ గ్యాప్ తర్వాత సమంత నుంచి వస్తున్న సినిమా యశోద. శ్రీదేవి మూవీస్ బ్యానర్ పై శివలెంక కృష్ణప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాతో హరి - హరీష్ దర్శకులుగా పరిచయమౌతున్నారు. వరలక్ష్మీ శరత్ కుమార్, ఉన్ని ముకుందన్, రావు రమేష్, మురళి శర్మ, సంపత్ రాజ్ కీలక పాత్రలు పోషించారు. తాజాగా సినిమా టీజర్ విడుదలైంది.

'యశోద'లో సమంత గర్భవతిగా కనిపించనున్నారని టీజర్ ద్వారా చెప్పారు. గర్భిణీ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో లేడీ డాక్టర్ ఆమెకు చెబుతుంటే... అందుకు విరుద్ధంగా ఆమె జీవితంలో ఘటనలు జరుగుతున్నట్లు టీజర్‌లో చూపించారు. ఈ సినిమాలో ఉన్ని ముకుందన్ డాక్టర్ రోల్ చేస్తున్నాడు. టీజ‌ర్‌లో కంటెంట్ మాత్రమే కాదు, క్వాలిటీ అవుట్‌పుట్ కూడా ఉంది. విజువల్స్ రిచ్‌గా ఉన్నాయి. లొకేషన్స్ ఎట్ట్రాక్ట్ చేశాయి. మణిశర్మ నేపథ్య సంగీతం ఉత్కంఠ రేకెత్తించేలా బాగుంది. ఇందులో సమంత పాత్ర చాలా కొత్తగా ఉంటుందంటున్నారు దర్శకులు.

టీజర్ ను భారీ ఎత్తున విడుదల చేశారు. జాతీయ స్థాయిలో దాదాపు 1400లకు పైగా థియేటర్లలో టీజర్ విడుదలైంది. సమంతకు ఉన్న పాన్ ఇండియా అప్పీల్ ను దృష్టిలో పెట్టుకొని ఇలా భారీ ఎత్తున, పలు భాషల్లో టీజర్ ను విడుదల చేశారు.

ఇదొక సీట్ ఎడ్జ్ యాక్షన్ థ్రిల్లర్. ఈ సినిమాలో యాక్షన్ ఎపిసోడ్స్ కోసం సమంత చాలా కష్టపడిందట. ఇప్పటివరకు ఎవరూ టచ్ చేయని సబ్జెక్ట్ తో ఈ సినిమా వస్తోందట. 100 రోజుల్లో చిత్రాన్ని పూర్తి చేశారు. ప్రస్తుతం డబ్బింగ్ వర్క్, ఎఫెక్ట్స్, రీ రికార్డింగ్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో భారీ ఎత్తున యశోద చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.



First Published:  10 Sep 2022 3:28 AM GMT
Next Story