Telugu Global
Cinema & Entertainment

సమంత సినిమాకు రిలీజ్ డేట్ ఫిక్స్

సమంత లీడ్ రోల్ పోషిస్తున్న ప్రేమకావ్యం శాకుంతలం. తాజాగా ఈ సినిమా విడుదల తేదీని ఫిక్స్ చేశారు.

సమంత సినిమాకు రిలీజ్ డేట్ ఫిక్స్
X

సమంత లీడ్ రోల్ పోషించిన సినిమా శాకుంతలం. భారీ గ్రాఫిక్ వర్క్ కారణంగా ఈ సినిమా ఈ ఏడాది థియేటర్లలోకి రాదని అంతా అనుకున్నారు. మొన్నటివరకు నిర్మాత నీలిమ గుణ కూడా ఎన్నో అనుమానాలకు తావిచ్చేలా స్టేట్ మెంట్స్ ఇచ్చారు. ఎట్టకేలకు శాకుంతలం సినిమాపై అనుమానాలు పటాపంచలయ్యాయి. ఈ సినిమా ఈ ఏడాదిలోనే థియేటర్లలోకి వస్తోంది. రిలీజ్ డేట్ కూడా ప్రకటించారు. నవంబర్ 4 న శాకుంతలం సినిమా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా థియేటర్లలోకి రానుంది.

ప్రపంచవ్యాప్తంగా పేరుతెచ్చుకున్న కావ్యం అభిజ్ఞాన శాకుంతలం. దీని ఆధారంగా భారీ బడ్జెట్, హై టెక్నికల్ వాల్యూస్‌తో దృశ్య కావ్యంగా 'శాకుంతలం' సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం ప్ర‌పంచవ్యాప్తంగా తెలుగు, హిందీ, త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో విడుద‌ల‌కు సిద్ధ‌మైంది.

శాకుంత‌లం కోట్లాది మంది హృద‌యాల‌ను గెలుచుకున్న శ‌కుంత‌ల‌, దుష్యంత మ‌హారాజు మ‌ధ్య జరిగిన అజ‌రామ‌ర ప్ర‌ణ‌య‌గాథ. ఇందులో శకుంత‌ల‌గా స‌మంత‌.. దుష్యంతుడిగా మలయాళ నటుడు దేవ్ మోహ‌న్ న‌టించారు. రిలీడ్ డేట్ పోస్టర్ లో వీళ్లిద్దరి మధ్య కెమిస్ట్రీ ఆకట్టుకునేలా ఉంది.

హృదయానికి హ‌త్తుకునే క‌థ‌తో పాటు భారీ తారాగ‌ణం ఈ చిత్రంలో న‌టించారు. స‌చిన్ ఖేడేక‌ర్‌, క‌బీర్ బేడీ, మోహ‌న్ బాబు, ప్ర‌కా‌ష్ రాజ్‌, మ‌ధుబాల‌, గౌత‌మి, అదితి బాల‌న్‌, అన‌న్య నాగ‌ళ్ల‌, జిస్సు సేన్ గుప్తా కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కుమార్తె అల్లు అర్హ యువ‌రాజు భ‌ర‌తుడి పాత్ర‌లో న‌టించ‌టం ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ కానుంది.



First Published:  23 Sep 2022 9:13 AM GMT
Next Story