Telugu Global
Cinema & Entertainment

Shaakunthalam - శాకుంతలం సినిమా ఫస్ట్ కాపీ రెడీ

Samantha's Shaakunthalam - ఎట్టకేలకు శాకుంతలం సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తయ్యాయి. ఫస్ట్ కాపీ రెడీ అయింది.

Shaakunthalam - శాకుంతలం సినిమా ఫస్ట్ కాపీ రెడీ
X

గుణ శేఖ‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న పౌరాణిక ప్రేమకథా చిత్రం ‘శాకుంతలం’. ఈ ఎపిక్ లవ్ స్టోరీలో సమంత, దేవ్ మోహన్ జంటగా నటించారు. ఈ విజువల్ వండర్ ప్ర‌పంచవ్యాప్తంగా ఏప్రిల్ 14న రిలీజ్ అవుతుంది. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు పూర్త‌య్యాయి. కాళిదాసు ర‌చించిన అభిజ్ఞాన శాకుంతలం ఆధారంగా శాకుంత‌లంను రూపొందిస్తున్నారు గుణ శేఖ‌ర్‌. శ్రీ వెంకటేశ్వ‌ర‌క క్రియేష‌న్స్ దిల్ రాజు స‌మ‌ర్ప‌ణ‌లో గుణ టీమ్ వ‌ర్క్స్ బ్యానర్‌పై నీలిమ గుణ ఈ పాన్ ఇండియా చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

3డీ టెక్నాల‌జీతో విజువ‌ల్ వండ‌ర్‌గా తెలుగు, హిందీ, త‌మిళ‌, హిందీ, మ‌ల‌యాళ భాష‌ల్లో శాకుంత‌లం సినిమా ప్రేక్ష‌కుల‌ను అల‌రించ‌నుంది. ఈ మూవీ ప్ర‌మోష‌న్స్‌ను పెద్ద ఎత్తున ప్లాన్ చేస్తున్నారు దిల్‌రాజు, గుణ శేఖ‌ర్ అండ్ టీమ్‌. ఇప్ప‌టికే విడుద‌లైన ఈ సినిమా పాట‌లు, టీజ‌ర్‌కు ఎక్స్‌ట్రార్డిన‌రీ రెస్పాన్స్ వ‌చ్చింది.

రీసెంట్‌గా సమంత, గుణ శేఖర్, దిల్ రాజు సహా టీమ్ స‌భ్యులంద‌రూ శాకుంత‌లం ఫ‌స్ట్ కాపీని చూశారు. అంతా పూర్తి సంతృప్తి వ్యక్తం చేశారు. సినిమా రిలీజ్ కావ‌టానికి ఇంకా నెల రోజులు ఉండ‌గానే ఫ‌స్ట్ కాపీ సిద్ధం చేశారు. అది కూడా అన్ని భాషల్లో ఫస్ట్ కాపీ రెడీ అయింది.

మార్చి 15న హైదరాబాద్ పెద్దమ్మ తల్లిని దర్శించుకుని పూజా కార్యక్రమాలు నిర్వహించి శాకుంతలం సినిమా ప్రమోషనల్ యాక్టివిటీస్ స్టార్ట్ చేయబోతున్నారు. మెలోడి బ్ర‌హ్మ మ‌ణిశ‌ర్మ సంగీతం అందిస్తోన్న శాకుంత‌లం చిత్రానికి సాయి మాధ‌వ్ బుర్రా సంభాష‌ణ‌లు అందించాడు.

First Published:  14 March 2023 3:41 PM GMT
Next Story