Telugu Global
Cinema & Entertainment

Shaakuntalam Twitter Review: శాకుంతలం మూవీ ట్విట్టర్ రివ్యూ

Samantha's Shaakuntalam Movie Twitter Review: ఈ రోజు విడుదలైన శాకుంతలం మూవీలో సమంత, దేవ్ మోహన్, అల్లు అర్హ, ప్ర‌కాష్ రాజ్, మోహన్ బాబు, గౌత‌మి, మ‌ధుబాల‌ తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

Shaakuntalam Movie Twitter Review: శాకుంతలం మూవీ ట్విట్టర్ రివ్యూ
X

Shaakuntalam Movie Twitter Review: శాకుంతలం మూవీ ట్విట్టర్ రివ్యూ

శాకుంతలం’...మన పురాతన మహాభారతం ఇతిహాసంలోని భరతుడి అంకానికి ముందు జరిగిన దుష్యంత మహారాజు – శకుంతల మధ్య జరిగిన ప్రేమ వ్యవహారం, వాళ్ళిద్దరి అన్యోన్య దాంపత్యం గురించిన కథ.

ఈ పౌరాణిక గాథ ఆధారంగా రూపొందించిన ఈ సినిమాలో శకుంతల పాత్రలో సమంత నటించగా ఆమెకు జోడీగా దుష్యంతుడి పాత్రలో మలయాళ హీరో దేవ్ మోహన్ నటించారు. పాన్ ఇండియా సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రంతో అల్లు అర్జున్ డాటర్ అల్లు అర్హ సినీ ఎంట్రీ ఇస్తోంది.

ఈ చిత్రంలో ప్ర‌కాష్ రాజ్, మోహన్ బాబు, గౌత‌మి, మ‌ధుబాల‌, అదితి బాల‌న్‌, అన‌న్య నాగ‌ళ్ల‌, జిస్సు సేన్ గుప్తా తదితరులు కీల‌క పాత్ర‌లు పోషించారు. గుణ శేఖర్ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాకి దిల్ రాజు సమర్పకుడిగా వ్యవహరించగా, నీలిమ గుణ నిర్మించారు.మ‌ణిశ‌ర్మ సంగీతం అందించారు. తెలుగు తో పాటుగా హిందీ , తమిళం , మలయాళం బాషలలో కూడా ఈ చిత్రాన్ని 2D, 3D వెర్షన్స్ లో విడుదల చేశారు.

శాకుంతలం మూవీ పై ట్విట్టర్ రివ్యూ మీ కోసం.












First Published:  13 April 2023 7:08 PM GMT
Next Story