Telugu Global
Cinema & Entertainment

Shaakuntalam - మరో సాంగ్ రిలీజ్ చేసిన శాకుంతలం యూనిట్

Samantha's Shaakuntalam - సమంత లీడ్ రోల్ పోషిస్తున్న శాకుంతలం సినిమా నుంచి మరో సాంగ్ రిలీజైంది.

Shaakuntalam - మరో సాంగ్ రిలీజ్ చేసిన శాకుంతలం యూనిట్
X

దుర్వాసుడి శాపం కారణంగా దుష్యంతుడి ప్రేమకు, గాంధర్వ వివాహానికి గుర్తుగా ఇచ్చిన ఉంగ‌రాన్ని పోగొట్టుకుంది శకుంత‌ల‌. శాపం కార‌ణంగా దుష్యంతుడు కూడా త‌న భార్య‌ను మ‌ర‌చిపోతాడు. అలాంటి ప‌రిస్థితుల్లో అస‌హాయురాలైన ఆమె ఏం చేస్తుంది? శ‌కుంత‌ల‌ మ‌నసుకి త‌గిలిన గాయాన్ని కాలం ఎలా మాన్పించింది అనే విష‌యాలు తెలుసుకోవాలంటే ‘శాకుంతలం’ సినిమా చూడాల్సిందే.

3డీ టెక్నాల‌జీతో విజువ‌ల్ వండ‌ర్‌గా వస్తున్న పౌరాణిక ప్రేమ క‌థా చిత్రం ‘శాకుంతలం’. దుష్యంత మహారాజుగా దేవ్ మోహన్ నటించగా.. శకుంతల పాత్రలో సమంత ఒదిగిపోయింది. ఈ పాన్ ఇండియా చిత్రాన్ని వ‌ర‌ల్డ్ వైడ్‌గా తెలుగు, హిందీ, త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో ఏప్రిల్ 14న భారీ ఎత్తున రిలీజ్ చేస్తున్నారు. శ్రీ వెంకటేశ్వ‌ర‌క క్రియేష‌న్స్ దిల్ రాజు స‌మ‌ర్ప‌ణ‌లో గుణ టీమ్ వ‌ర్క్స్ బ్యానర్‌పై నీలిమ గుణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

తాజాగా ఈ విజువ‌ల్ వండ‌ర్ నుంచి ‘మధుర గతమా..’ అనే పాటను చిత్ర యూనిట్ విడుదల చేసింది. దుష్యంతుడికి దూరమైన శకుంతల, తన మనసులోని బాధను వ్యక్తం చేసే సందర్భంలో వచ్చే పాటిది. పాట వింటుంటే ఓ ఎమోష‌న‌ల్ టచ్‌తో సాగుతూ భార్యాభ‌ర్త‌ల మ‌ధ్య ఉండే అనుబంధాన్ని తెలియ‌జేసేలా ఉంది. మ‌ణిశ‌ర్మ సంగీత సార‌థ్యం వ‌హించిన ఈ సినిమాలోని పాట‌ను శ్రీమ‌ణి రాయ‌గా.. అర్మాన్ మాలిక్‌, శ్రేయా ఘోష‌ల్ పాడారు.

స‌మంత, దేవ్ మోహ‌న్ జంట‌గా న‌టించిన శాకుంత‌లం చిత్రంలో మోహ‌న్ బాబు, ప్ర‌కాష్‌ రాజ్‌, మ‌ధుబాల‌, గౌత‌మి, అదితి బాల‌న్‌, అన‌న్య నాగ‌ళ్ల‌, జిస్సు సేన్ గుప్తా కీల‌క పాత్ర‌లు పోషించారు. అల్లు అర్జున్ కుమార్తె అల్లు అర్హ యువ‌రాజు భ‌ర‌తుడి పాత్ర‌లో న‌టించింది.



First Published:  15 Feb 2023 3:42 PM GMT
Next Story