Telugu Global
Cinema & Entertainment

Shaakuntalam: సమంత సినిమాకు రిలీజ్ డేట్ ఫిక్స్

Shaakuntalam: చాన్నాళ్లుగా పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్ లో ఉన్న శాకుంతలం సినిమా విడుదలకు సిద్ధమైంది. ఫిబ్రవరి 17న రాబోతోంది.

Shaakuntalam: సమంత సినిమాకు రిలీజ్ డేట్ ఫిక్స్
X

గుణశేఖ‌ర్ తెరకెక్కిస్తున్న పౌరాణిక‌ దృశ్యకావ్యం శాకుంతలం. స‌మంత ఇందులో టైటిల్ పాత్ర‌లో న‌టించింది. దిల్ రాజు స‌మ‌ర్ప‌ణ‌లో నీలిమ గుణ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.

ప్ర‌ముఖ క‌వి కాళిదాసు ర‌చించిన సంస్కృత‌ నాటకం అభిజ్ఞాన శాకుంతలం ఆధారంగా 'శాకుతలం' చిత్రాన్ని గుణ శేఖ‌ర్‌ తెరకెక్కిస్తున్నాడు. శ‌కుంత‌ల‌, దుష్యంత మ‌హారాజు అజ‌రామ‌ర‌మైన ప్రేమ క‌థ‌ ఇది. ఇందులో శ‌కుంత‌ల‌గా స‌మంత‌.. దుష్యంతుడిగా దేవ్ మోహ‌న్ న‌టించారు.

Advertisement

ఈ సినిమా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ పనులు దాదాపు పూర్తయ్యాయి. దీంతో నిర్మాత‌లు ఈ సినిమా రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేశారు. 'శాకుంతలం' చిత్రాన్ని ప్ర‌పంచవ్యాప్తంగా ఫిబ్ర‌వ‌రి 17న తెలుగు, హిందీ, త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో రిలీజ్ చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఈ సినిమా 3Dలో కూడా రిలీజ్ అవుతోంది.

ఈ సినిమాలో మోహ‌న్ బాబు, ప్ర‌కాష్ రాజ్‌, మ‌ధుబాల‌, గౌత‌మి కీల‌క పాత్ర‌ల‌ు పోషించారు. అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హ, యువ‌రాజు భ‌ర‌తుడి పాత్ర‌లో న‌టించింది. ఈ సినిమాకు సాయి మాధ‌వ్ బుర్రా మాటలు, మ‌ణిశ‌ర్మ సంగీతం అందిస్తున్నారు.

Next Story