Telugu Global
Cinema & Entertainment

రేపట్నుంచి సమంత ప్రచారం

Samantha shaakuntalam- రేపటి నుంచి శాకుంతలం ప్రచారం స్టార్ట్ అవుతుంది. సమంత ప్రమోషన్స్ కోసం వస్తుంది.

రేపట్నుంచి సమంత ప్రచారం
X

సమంత అభిమానులకు గుడ్ న్యూస్. ఆమె ఆరోగ్యం కుదుటపడింది. ప్రస్తుతం హిందీలో ఓ వెబ్ సిరీస్ కూడా చేస్తోంది. మరో గుడ్ న్యూస్ ఏంటంటే.. రేపట్నుంచి ఆమె తన తెలుగు సినిమా ప్రచారంలో పాల్గొంటుంది.


సమంత నటించిన ప్రతిష్టాత్మక చిత్రం శాకుంతలం. గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మైథలాజికల్ మూవీ, సమంత కెరీర్ లోనే భారీ బడ్జెట్ చిత్రంగా పేరుతెచ్చుకుంది. గుణశేఖర్, దిల్ రాజు కలిసి నిర్మించారు.


ఫిబ్రవరి 17న ఈ సినిమాను విడుదల చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు రేపట్నుంచి ప్రచారం నిర్వహించాలనుకుంటున్నారు. ముందుగా ఇంటర్వ్యూలు పూర్తిచేసి, ఆ తర్వాత గ్రౌండ్ ఈవెంట్స్ ప్లాన్ చేస్తున్నారు.


ఇంతకుముందు సమంత చేసిన యశోద సినిమాకు ప్రచారంలో ఇబ్బందులు ఎదురయ్యాయి. ఆరోగ్యం బాగాలేకపోవడంతో, యశోద సినిమాకు పూర్తిస్థాయిలో ప్రచారం చేయలేకపోయింది సమంత. అదే ఇబ్బంది శాకుంతలం సినిమాకు కూడా రిపీట్ అవుతుందని అంతా అనుకున్నారు. కానీ సమంత కోలుకుంది. ప్రచారంలో పాల్గొనడానికి రెడీ అయింది.

First Published:  31 Jan 2023 12:43 PM GMT
Next Story