Telugu Global
Cinema & Entertainment

Samantha | సమంతపై మరో ప్రచారం

Samantha Shahrukh Khan - సమంత-షారూక్ కలిసి సినిమా చేయబోతున్నారట. ఇప్పుడిదే హాట్ టాపిక్.

Samantha | సమంతపై మరో ప్రచారం
X

లాంగ్ గ్యాప్ తర్వాత హీరోయిన్ సమంత మళ్లీ సినిమాలపై ఫోకస్ పెట్టిన సంగతి తెలిసిందే. తన సొంత బ్యానర్ పై ఆమె సినిమా ప్రకటించిన సంగతి తెలిసిందే. అటు మలయాళంలో గౌతమ్ మీనన్ దర్శకత్వంలో మమ్ముట్టి హీరోగా ఓ సినిమా చేయబోతోంది.

ఇవన్నీ త్వరలోనే సెట్స్ పైకి రాబోతున్నాయి. అంతలోనే సమంతపై మరో గాసిప్ పుట్టుకొచ్చింది. షారూక్ ఖాన్ సినిమాలో సమంత నటించబోతున్నట్టు వార్తలొస్తున్నాయి. రాజ్ కుమార్ హిరాణి దర్శకత్వంలో త్వరలోనే ఓ సినిమా చేయబోతున్నాడు షారూక్. ఇందులో అతడి సరసన సమంత హీరోయిన్ గా నటించబోతోందంట.

యాక్షన్, అడ్వెంచర్, పేట్రియాటిక్ అంశాలతో రాబోతున్న ఈ సినిమాలో సమంత పాత్ర చాలా కీలకం అంటున్నారు. అయితే దీనిపై ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన రాలేదు. ఇంతకుముందు షారూక్-హిరాణి దర్శకత్వంలో డంకీ వచ్చిన సంగతి తెలిసిందే.

బాలీవుడ్ లో కూడా సమంతకు మంచి క్రేజ్ ఉన్న విషయం తెలిసిందే. ఆమె నటించిన ఫ్యామిలీమేన్ సీజన్-2కు హిందీ బెల్ట్ లో మంచి క్రేజ్ వచ్చింది. దీనికితోడు పుష్ప సినిమాలో సమంత చేసిన ఐటెంసాంగ్ ఉత్తరాదిని ఊపేసింది.

First Published:  23 Jun 2024 3:53 PM GMT
Next Story