Telugu Global
Cinema & Entertainment

Samantha Yashoda: మళ్లీ థ్యాంక్స్ చెప్పిన సమంత

Samantha Yashoda movie - యశోద మూవీ సక్సెస్ ను ఫుల్ గా ఎంజాయ్ చేస్తోంది సమంత. ఈ సినిమా దిగ్విజయంగా రెండో వారంలోకి ఎంటరైన సందర్భంగా మరోసారి ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపింది.

Samantha Yashoda: మళ్లీ థ్యాంక్స్ చెప్పిన సమంత
X

సమంత తాజా చిత్రం యశోద. ప్రస్తుతం థియేటర్లలో నడుస్తున్న సినిమా ఇది మాత్రమే. కాంతార తర్వాత ఓ మోస్తరుగా జనం వస్తోంది ఈ సినిమాకే. అలా సక్సెస్ ఫుల్ గా సెకెండ్ వీక్ లోకి ఎంటరైంది యశోద సినిమా.

ఈ సినిమా సక్సెస్ అయిందంటూ ఇప్పటికే ప్రేక్షకులకు బహిరంగ లేఖ రాసిన సమంత, తాజాగా మరోసారి స్పందించింది. సినిమా విజయవంతంగా రెండోవారంలోకి ప్రవేశించిన వేళ, మరోసారి అందరికీ థ్యాంక్స్ చెప్పింది.

"యశోద రెండో వారంలోకి వచ్చేసింది. మా అంచనాల్ని మించిపోయింది. ప్రేక్షకులు థియేటర్లకు వస్తుంటే చాలా ఆనందంగా ఉంది. ఈ వారం రిలీజైన సినిమాలు కూడా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను."

ఇలా యశోద సక్సెస్ పై మరోసారి స్పందించింది సమంత. ఈ సినిమాతో హరి-హరీష్ అనే ఇద్దరు దర్శకులు టాలీవుడ్ కు పరిచయమయ్యారు. శ్రీదేవి మూవీస్ బ్యానర్ పై శివలెంక కృష్ణప్రసాద్ నిర్మించిన ఈ సినిమాకు మణిశర్మ అందించిన సంగీతం ప్రాణంపోసింది.

Next Story