Telugu Global
Cinema & Entertainment

Samantha: సినిమాలకు లాంగ్ బ్రేక్.. సమంత సంచలన నిర్ణయం..

Samantha: ముందు ఒప్పుకున్న తమిళ్, హిందీ సినిమాల నుంచి తాను తప్పుకుంటున్నట్లు ఆయా సినిమాల నిర్మాతలకు సమంత ఇప్పటికే సమాచారం ఇచ్చినట్లు టాక్. సినిమాలకు లాంగ్ బ్రేక్ ఇచ్చి పూర్తిగా కోలుకున్న తర్వాత సమంత కొత్త ప్రాజెక్టులకు ఓకే చెప్పనున్నట్లు తెలుస్తోంది.

Samantha: సినిమాలకు లాంగ్ బ్రేక్.. సమంత సంచలన నిర్ణయం..
X

ఏం మాయ చేసావే సినిమాతో హీరోయిన్‌గా టాలీవుడ్‌కు పరిచయమైంది సమంత. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ అందుకున్న ఆమె మంచి స్టార్డం అందుకోవడంతోపాటు వరుసబెట్టి టాలీవుడ్‌లో ఉన్న అగ్ర హీరోలు అందరితోనూ నటించింది. తెలుగులో నెంబర్ వన్ హీరోయిన్‌గా ఎదిగింది. ఇక తెలుగుతోపాటు తమిళ్, హిందీ సినిమాల్లో కూడా మంచి పాపులారిటీ సంపాదించుకుంటున్న సమయంలో సమంత ఉన్నట్టుండి అనారోగ్యం పాలయింది. తాను మయోసైటిస్ అనే వ్యాధితో బాధపడుతున్నట్లు స్వయంగా సమంత ప్రకటించింది.

ప్రస్తుతం ఆమె నటిస్తున్న సినిమాలన్నింటికి చిన్న బ్రేక్ ఇచ్చి చికిత్స పొందుతోంది. అయితే కొన్నాళ్లపాటు సినిమాలకు బ్రేక్ ఇచ్చి ఆ తర్వాత ముందు ఒప్పుకున్న సినిమాలను పూర్తి చేయాలని సమంత భావించింది. అయితే ఆమె ప్రస్తుతం తీసుకుంటున్న ట్రీట్‌మెంట్‌ పూర్తి కావడానికి మరి కొంత సమయం పట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాక ట్రీట్‌మెంట్‌ పూర్తయిన తర్వాత కొంతకాలం విశ్రాంతి తీసుకోవాలని కూడా సమంత భావిస్తున్నట్లు సమాచారం.

అయితే అన్ని రోజులపాటు నిర్మాతలను వెయిట్ చేయించడం కష్టం కాబట్టి సమంత తాను ముందు ఒప్పుకున్న సినిమాలను క్యాన్సిల్ చేసుకుంటున్నట్లు టాక్. ది ఫ్యామిలీ మెన్ -2 వెబ్ సిరీస్ సక్సెస్ తర్వాత బాలీవుడ్‌లో కూడా సమంతకు మంచి క్రేజ్ వచ్చింది. దీంతో హిందీలో కూడా ఆమెకు పలు ఆఫర్లు వచ్చాయి. అలాగే ఒక హాలీవుడ్ సినిమా చేసేందుకు కూడా సమంత ఒప్పుకుంది.

అయితే ఈ సినిమాలన్నింటి నుంచి సమంత తప్పుకుంటున్నట్లు సమాచారం. ప్రస్తుతం సమంత తెలుగులో శాకుంతలం, ఖుషి సినిమాల్లో నటిస్తోంది. ఇందులో శాకుంతలం సినిమా షూటింగ్ చాలావరకు పూర్తికాగా, ఖుషి సినిమా షూటింగ్ 60 శాతం మేర జరిగింది. దీంతో ఈ రెండు సినిమాలను పూర్తి చేయాలని సమంత నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇవి కాకుండా ముందు ఒప్పుకున్న తమిళ్, హిందీ సినిమాల నుంచి తాను తప్పుకుంటున్నట్లు ఆయా సినిమాల నిర్మాతలకు సమంత ఇప్పటికే సమాచారం ఇచ్చినట్లు టాక్. సినిమాలకు లాంగ్ బ్రేక్ ఇచ్చి పూర్తిగా కోలుకున్న తర్వాత సమంత కొత్త ప్రాజెక్టులకు ఓకే చెప్పనున్నట్లు తెలుస్తోంది.

First Published:  20 Dec 2022 1:08 PM GMT
Next Story