Telugu Global
Cinema & Entertainment

సమంత సినీ కెరీర్ కు 14 ఏళ్ళు

ముఖ్యంగా తెలుగు, తమిళ భాషల్లో దశాబ్ద కాలం పాటు ఆమె నెంబర్ వన్ హీరోయిన్ గా రాణించింది. సమంత సినీ ఇండస్ట్రీలోకి ప్రవేశించి నేటితో 14 సంవత్సరాలు పూర్తయ్యాయి.

సమంత సినీ కెరీర్ కు 14 ఏళ్ళు
X

సౌత్ సినీ ఇండస్ట్రీలో పరిచయం అక్కర్లేని పేరు సమంత. ముఖ్యంగా తెలుగు, తమిళ భాషల్లో దశాబ్ద కాలం పాటు ఆమె నెంబర్ వన్ హీరోయిన్ గా రాణించింది. సమంత సినీ ఇండస్ట్రీలోకి ప్రవేశించి నేటితో 14 సంవత్సరాలు పూర్తయ్యాయి.

సమంత నటించిన తొలి చిత్రం ఏమాయ చేసావే తెలుగులో విడుదలై ఘన విజయం సాధించింది. ఆ మూవీ సక్సెస్ తో తెలుగులో ఎనలేని గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత ఆమె నటించిన సినిమాలు వరుసగా సూపర్ హిట్ అయ్యాయి.

తెలుగు, తమిళ భాషల్లోని అందరు అగ్ర హీరోలతో సమంత జోడి కట్టింది. ఏ మాయ చేసావే తర్వాత సమంత నటించిన బృందావనం, దూకుడు, ఈగ,ఎటో వెళ్లిపోయింది మనసు, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, అత్తారింటికి దారేది, అల్లుడు శ్రీను, అఆ, మహానటి, కత్తి, 24, అభిమన్యుడు, మనం తదితర సినిమాలు ఆమెను నెంబర్ వన్ హీరోయిన్ గా నిలబెట్టాయి.

ఫ్యామిలీ మెన్ వెబ్ సిరీస్ ద్వారా హిందీ ప్రేక్షకులకు కూడా సమంత చేరువైంది. ప్రస్తుతం ఆమె వరుసగా హిందీలో సినిమాలు, వెబ్ సిరీస్ లు చేస్తోంది. సమంత తన సినీ కెరీర్ 14 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా పలువురు ప్రముఖులు ఆమెకు శుభాకాంక్షలు చెప్పారు. ఈ సందర్భంగా హీరోయిన్ నయనతార సమంతకు ప్రత్యేకంగా విషెస్ తెలిపారు. సోషల్ మీడియా వేదికగా సమంత ఫ్యాన్స్ తమ అభిమాన నటికి శుభాకాంక్షలు తెలియజేశారు.

First Published:  26 Feb 2024 4:51 PM GMT
Next Story