Telugu Global
Cinema & Entertainment

Samantha | అల్లు అర్జున్ నాకు స్ఫూర్తి

Samantha - నటనలో తనకు అల్లు అర్జున్ స్ఫూర్తి అని ప్రకటించింది సమంత. బన్నీ యాక్టింగ్ కు ఫిదా అయ్యానని చెబుతోంది.

Samantha | అల్లు అర్జున్ నాకు స్ఫూర్తి
X

హీరోయిన్ సమంత తన మనసులో మాట బయటపెట్టింది. తనకు అల్లు అర్జున్ యాక్టింగ్ అంటే ఇష్టమని తెలిపింది. అంతేకాదు, నటనలో తనకు అల్లు అర్జున్ స్ఫూర్తి అనే విషయాన్ని కూడా బయటపెట్టింది.

ఓ కాలేజీ ఈవెంట్ కు హాజరైన సమంతకు, నటనలో ఎవరు స్ఫూర్తి అనే ప్రశ్న ఎదురైంది. దీనికి తడుముకోకుండా అల్లు అర్జున్ పేరు చెప్పింది సమంత. కెరీర్ లో బన్నీ తనను తాను మార్చుకున్న విధానం చూస్తే ముచ్చటేస్తుందని, అతడ్ని యాక్టింగ్ బీస్ట్ గా అభివర్ణించింది.

బన్నీతో కలిసి సన్నాఫ్ సత్యమూర్తి సినిమా చేసింది సమంత. ఆ సినిమా టైమ్ లో అతడి నుంచి చాలా నేర్చుకున్నానని తెలిపింది. ఇక పుష్పలో బన్నీ నెక్ట్స్ లెవెల్లో నటించాడని, అందులో అతడితో ఐటెంసాంగ్ చేయడం తనకు మంచి అనుభవమని తెలిపింది.

ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ సినిమాలకు విరామం ప్రకటించింది. త్వరలోనే కొత్త ప్రాజెక్టుల్ని ప్రకటించబోతోంది. పుష్ప-2లో కూడా సమంత ఐటెంసాంగ్ చేసే అవకాశం ఉంది.

First Published:  5 March 2024 5:28 PM GMT
Next Story