Telugu Global
Cinema & Entertainment

నేనిప్పుడు డిఫిక‌ల్ట్ పొజిష‌న్‌లో ఉన్నా.. - త్వ‌ర‌లో ఓవ‌ర్‌క‌మ్ అవుతాన‌నుకుంటున్నా: స‌మంత‌

తాజాగా ఇచ్చిన ఇంట‌ర్వ్యూ సుమ నిర్వ‌హించ‌గా, ఇందులో ఆమె ఆరోగ్య అంశాలతో పాటు ప్ర‌ధానంగా `య‌శోద‌` మూవీ అంశాల‌ను పంచుకోవ‌డానికి ప్ర‌య‌త్నించిన‌ట్టు క‌నిపించింది.

నేనిప్పుడు డిఫిక‌ల్ట్ పొజిష‌న్‌లో ఉన్నా..  - త్వ‌ర‌లో ఓవ‌ర్‌క‌మ్ అవుతాన‌నుకుంటున్నా: స‌మంత‌
X

మ‌యోసైటిస్ బారిన ప‌డిన‌ట్టు వెల్ల‌డించి అభిమానుల‌ను ఆందోళ‌న‌కు గురిచేసిన స‌మంత‌.. లైవ్ ఇంట‌ర్వ్యూతో మ‌రోసారి జ‌నం ముందుకు వ‌చ్చారు. ఈ సంద‌ర్భంగా అనేక విష‌యాలు పంచుకున్న సామ్‌.. త‌న ఆరోగ్యం విష‌యంలో మాత్రం తానిప్పుడు డిఫిక‌ల్ట్ పొజిష‌న్‌లోనే ఉన్నాన‌ని చెప్పారు. త్వ‌ర‌లోనే ఓవ‌ర్‌క‌మ్ అవుతాన‌నుకుంటున్నా.. అంటూ ఆశాభావం వ్య‌క్తం చేశారు.

మ‌యోసైటిస్ వ‌చ్చిన‌ట్టు వెల్ల‌డించిన త‌ర్వాత సోష‌ల్ మీడియాలో ప‌లువురు పాజిటివ్‌గా స్పందించార‌ని, తాను త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ఆకాంక్షించార‌ని చెప్పి.. వారికి త‌న కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. అదే క్ర‌మంలో మ‌రికొన్ని సోష‌ల్ మీడియా సైట్ల‌లో త‌న‌కు ప్రాణాంత‌క వ్యాధి వ‌చ్చిందంటూ.. వార్త‌లు రావ‌డం త‌న‌కు ఆశ్చ‌ర్యం క‌లిగించింద‌ని చెప్పారు. తానింకా బ‌తికే ఉన్నాన‌ని ఈ సంద‌ర్భంగా ఆమె న‌వ్వుతూ వెల్ల‌డించారు. త‌న ఆరోగ్య ప‌రిస్థితిపై ఈ సంద‌ర్భంగా భావోద్వేగానికి గురై... క‌న్నీళ్లు పెట్టుకున్నారు సామ్‌.

తాజాగా ఇచ్చిన ఇంట‌ర్వ్యూ సుమ నిర్వ‌హించ‌గా, ఇందులో ఆమె ఆరోగ్య అంశాలతో పాటు ప్ర‌ధానంగా `య‌శోద‌` మూవీ అంశాల‌ను పంచుకోవ‌డానికి ప్ర‌య‌త్నించిన‌ట్టు క‌నిపించింది. త్వ‌ర‌లో ఈ మూవీ విడుద‌ల కాబోతున్న నేప‌థ్యంలో ఈ చిత్ర ప్ర‌చారానికి ఈ ఇంట‌ర్వ్యూ దోహ‌ద‌ప‌డుతుంద‌ని భావించిన‌ట్టు అర్థ‌మ‌వుతోంది.

First Published:  8 Nov 2022 6:37 AM GMT
Next Story