Telugu Global
Cinema & Entertainment

Samantha | ఈమధ్య కాలంలో బాగా నవ్వుకున్న సినిమా ఇదే

Samantha - మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమా చూసింది సమంత. ఈమధ్య కాలంలో ఇంత కామెడీ చూడలేదంటోంది.

Samantha Ruth Prabhu
X

టాలీవుడ్ స్టార్ బ్యూటీ సమంత 

నవీన్ పొలిశెట్టి, అనుష్క శెట్టి జంటగా నటించిన మూవీ ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’. ఈ సినిమాకు ఆడియెన్స్ తో పాటు సెలబ్రిటీల అప్రిషియేషన్స్ దక్కుతున్నాయి. ఈ సినిమా ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి, దర్శకధీరుడు రాజమౌళి, స్టార్ డైరెక్టర్ మారుతి మెప్పు పొందగా..తాజాగా స్టార్ హీరోయిన్ సమంత ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ సినిమాపై ప్రశంసలు కురిపించింది.

‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ సినిమా చూశాక స్టార్ హీరోయిన్ సమంత ఇన్ స్టాగ్రామ్ ద్వారా స్పందిస్తూ. ఇటీవల కాలంలో ఏ సినిమా నన్ను ఇంతగా నవ్వించలేదు. అనుష్క ఛార్మింగ్ గా కనిపించింది, నవీన్ పోలిశెట్టి పెర్ఫార్మెన్స్ సూపర్బ్ గా ఉంది. ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ టీమ్ అందరికీ కంగ్రాట్స్. అని పోస్ట్ చేసింది.

రీసెంట్ గా రిలీజైన ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ సినిమా అన్నివర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకుని సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ పాజిటివ్ టాక్ కు తగినట్లే మంచి వసూళ్లు దక్కించుకుంటోంది. యూఎస్ లో హాఫ్-మిలియన్ మార్క్ చేరుకున్న ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ వన్ మిలియన్ మైల్ స్టోన్ వైపు దూసుకెళ్తోంది.

రొమాంటిక్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ కథతో ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ చిత్రాన్ని ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ యువీ క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై వంశీ, ప్ర‌మోద్‌ నిర్మాణంలో దర్శకుడు మ‌హేష్ బాబు.పి తెరకెక్కించారు.

First Published:  9 Sep 2023 5:02 PM GMT
Next Story