Telugu Global
Cinema & Entertainment

Samajavaragamana Movie OTT | ఓటీటీలోకి సూపర్ హిట్ మూవీ

Samajavaragamana Movie OTT | శ్రీవిష్ణు హీరోగా నటించిన సూపర్ హిట్ మూవీ సామజవరగమన (Samajavaragamana). ఇప్పుడీ సినిమా ఓటీటీ (OTT) రిలీజ్ కు రెడీ అయింది.

సామజవరగమన
X

సామజవరగమన

Samajavaragamana Movie OTT | రీసెంట్ టైమ్సో హిట్టయిన సినిమా సామజవరగమన. ఈ సినిమాకు అటుఇటు ఒక్క సినిమా కూడా ఆడలేదు. అలా 3 వారాల పాటు అప్రతిహతంగా తన బాక్సాఫీస్ సక్సెస్ ను కొనసాగించింది ఈ సినిమా. శ్రీవిష్ణు, రెబ్బా మోనికా జాన్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమా, ఈ హీరో కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.

థియేటర్లలో నవ్వులు పూయించిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వస్తోంది. సామజవరగమన సినిమాను త్వరలోనే స్ట్రీమింగ్ చేయబోతున్నట్టు ఆహా సంస్థ ప్రకటించింది. త్వరలోనే తేదీని వెల్లడిస్తామని తెలిపింది. ఈ సినిమాన ఆహాతో పాటు అమెజాన్ లో కూడా ఈ సినిమా స్ట్రీమింగ్ కు వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతానికి ఇంకా క్లారిటీ రాలేదు.

తాజాగా ఈ సినిమా 17 రోజుల రన్ పూర్తి చేసుకుంది. ఈ 17 రోజుల్లో సినిమాకు ప్రపంచవ్యాప్తంగా 47 కోట్ల 24 లక్షల రూపాయల గ్రాస్ వచ్చినట్టు మేకర్స్ ప్రకటించారు. అటు ఓవర్సీస్ లో కూడా ఈ సినిమా సూపర్ హిట్టయింది.

రామ్ అబ్బరాజు దర్శకత్వంలో తెరకెక్కింది సామజవరగమన సినిమా. రాజేష్ దండ నిర్మించిన ఈ సినిమాను అనీల్ సుంకర సమర్పించారు. ఏజెంట్ తో భారీ డిజాస్టర్ చూసిన అనీల్ సుంకర, ఈ సినిమాతో కాస్త తేరుకున్నాడు.

First Published:  16 July 2023 2:54 PM GMT
Next Story