Telugu Global
Cinema & Entertainment

Tantra movie | సలోనీ రీఎంట్రీ మూవీ ఇదే

Tantra Movie - లాంగ్ గ్యాప్ తర్వాత రీఎంట్రీ ఇస్తోంది సలోనీ. ఆమె రీఎంట్రీ మూవీ పేరు తంత్ర.

Tantra movie | సలోనీ రీఎంట్రీ మూవీ ఇదే
X

'ధన 51’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైంది సలోని. ‘మర్యాద రామన్న’, ‘బాడీగార్డ్‌’ లాంటి మంచి సినిమాల్లో నటించింది. పక్కింటి అమ్మాయి పాత్రలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత కొన్ని స్పెషల్ సాంగ్స్ చేసింది. ‘రేసుగుర్రం’ చిత్రంలో అతిథి పాత్రలో మెప్పించిన ఆమె తెలుగు సినిమాలకు కొంతగ్యాప్‌ ఇచ్చింది.

ప్రస్తుతం ‘తంత్ర’ చిత్రంతో రీ ఎంట్రీ ఇవ్వబోతోంది సలోనీ. ‘మల్లేశం’, ‘వకీల్‌సాబ్‌’ చిత్రాల ఫేం అనన్య నాగళ్ల ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ చిత్రంలో సలోని ఓ కీలక పాత్రలో కనిపించనుంది. ఫస్ట్‌ కాపీ మూవీస్‌, బి ద వే ఫిల్మ్స్‌, వైజాగ్ ఫిల్మ్‌ ఫ్యాక్టరీ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంతో శ్రీనివాస్‌ గోపిశెట్టి దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు.

హారర్‌ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రం పోస్టర్‌ను నిర్మాణ సంస్థ విడుదల చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది. భయంకరమైన క్షుద్రశక్తులు అనన్యని పీడిస్తున్నట్టుగా కనపడుతున్న పోస్టర్‌ ఆసక్తికరంగా ఉంది. ‘మగధీర’లో షేర్‌ఖాన్‌ లాంటి ఎన్నో వైవిధ్యమైన పాత్రలతో మెప్పించిన దివంగత నటుడు శ్రీహరి తమ్ముడి కొడుకు ధనుష్‌ ఈ చిత్రంతో హీరోగా పరిచయమవుతున్నాడు.

ఫీమేల్‌ ఓరియెంటెడ్‌ లైన్‌తో రూపొందుతున్న హారర్‌ ఎంటర్‌టైనర్‌ ఇది. భారతీయ తాంత్రిక శాస్త్రం, పురాణ గాథల నేపథ్యంలో ఆద్యంతం ఉత్కంఠగా సాగుతుంది. తంత్ర శాస్త్రానికి చెందిన విస్తు గొలిపే రహస్యాలను ఈ చిత్రం ద్వారా చెప్పబోతున్నారు. ఇందులో అనన్య నాగళ్లతోపాటు ‘మర్యాదరామన్న’ ఫేం సలోని కీ రోల్‌ పోషిస్తోంది. రీఎంట్రీలో సలోనీ క్లిక్ అవ్వాలని ఆశిద్దాం.

First Published:  25 Aug 2023 5:47 AM GMT
Next Story