Telugu Global
Cinema & Entertainment

Salman Khan | సికందర్ గా సల్మాన్ ఖాన్

Salman Khan - బాలీవుడ్ హీరోల్లో సల్మాన్ ఖాన్ కు కలిసొచ్చినంతగా, ఇతర ఏ హీరోకు రంజాన్ కలిసిరాలేదు. అందుకే మరోసారి రంజాన్ నే నమ్ముకున్నాడు ఈ హీరో.

Salman Khan | సికందర్ గా సల్మాన్ ఖాన్
X

సౌత్ స్టార్ డైరక్టర్ మురుగదాస్ బాలీవుడ్ లో రీఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. సల్మాన్ ఖాన్ హీరోగా ఓ సినిమా చేయబోతున్నాడు మురగదాస్. తాజాగా ఈ సినిమాకు సంబంధించి టైటిల్ ఫిక్స్ చేశారు. సల్మాన్-మురుగ సినిమాకు సికందర్ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ పాత్ర పేరు ఇది.

రంజాన్ సందర్బంగా టైటిల్ ప్రకటించిన మేకర్స్, వచ్చే ఏడాది రంజాన్ కు సినిమాను విడుదల చేస్తామని ఎనౌన్స్ చేశారు. నడియావాలా గ్రాండ్ సన్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై సాజిద్ నడియావాలా ఈ సినిమాను నిర్మించబోతున్నాడు.

మురుగదాస్ కు బాలీవుడ్ కొత్త కాదు. హిందీ గజనీ సినిమాను అమీర్ ఖాన్ తో, తుపాకీ సినిమాను అక్షయ్ కుమార్ తో రీమేక్ చేశాడు. అయితే ఆ తర్వాత గ్యాప్ ఇచ్చాడు. మళ్లీ ఇన్నేళ్లకు బాలీవుడ్ పై మురుగదాస్ కన్నుపడింది. ఈసారి సల్మాన్ ఖాన్ తో సికందర్ తీస్తున్నాడు.

సల్మాన్ ఖాన్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటిగా నిలిచింది కిక్ సినిమా. తెలుగు కిక్ సినిమాకు ఇది రీమేక్. ఈ సినిమాకు సీక్వెల్ వస్తుందని గతంలోనే ప్రకటించాడు దర్శక-నిర్మాత సాజిద్ నడియావాలా. చెప్పినట్టుగానే కిక్-2 తెరపైకి వచ్చింది. అయితే దర్శకుడు మాత్రం సాజిద్ కాదు, మురుగదాస్.

పైగా ఇది తెలుగులో వచ్చిన కిక్-2కు రీమేక్ కాదు. పూర్తిగా కొత్త కథతో సికందర్ రాబోతోంది. కాకపోతే కిక్ లో హీరో పాత్ర మాత్రం కొనసాగుతుంది. వచ్చే నెలలో చిన్న షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారు. జూన్ నుంచి పూర్తిస్థాయిలో సెట్స్ పైకి వెళ్తుంది సికందర్.

First Published:  13 April 2024 12:48 AM GMT
Next Story