Telugu Global
Cinema & Entertainment

Salaar | భారీగా పెరగనున్న సలార్ టికెట్ రేట్లు?

Salaar - ప్రభాస్ అప్ కమింగ్ మూవీ సలార్. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా కోసం తెలుగు రాష్ట్రాల్లో టికెట్ రేట్లు పెంచబోతున్నారు.

Salaar Teaser: సలార్ అరాచకం.. టీజర్ తో రచ్చ లేపిన ప్రభాస్
X

Salaar Teaser: సలార్ అరాచకం.. టీజర్ తో రచ్చ లేపిన ప్రభాస్

సలార్ మేకర్స్, తెలుగు రాష్ట్రాల్లో టిక్కెట్ ధరల పెంపు కోసం ప్రయత్నిస్తున్నారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ నటించిన ఈ భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీకి టికెట్ రేట్లు భారీగా పెరగనున్నాయి. ఈ చిత్రం థియేట్రికల్ విడుదలకు దాదాపు 5 వారాల సమయం ఉంది. ఈ గ్యాప్ లో టికెట్ రేట్ల పెంపు కోసం తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలతో సంప్రదింపులు మొదలుపెట్టారు మేకర్స్.

సలార్ భారీ బడ్జెట్ చిత్రం కాబట్టి, రెండు తెలుగు రాష్ట్రాల్లో 10 రోజుల పాటు టికెట్ ధరలను 50 నుండి 75 రూపాయల వరకు పెంచడానికి అనుమతించాలని మేకర్స్ ప్రభుత్వాన్ని అభ్యర్థించారు. భారీ బడ్జెట్ చిత్రం కావడంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ సినిమా టిక్కెట్ ధరను పెంచే అవకాశం ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ సినిమా భారీ వసూళ్లను సాధిస్తే బాక్సాఫీస్ వద్ద భారీ రికార్డులు నెలకొల్పుతుందని అంచనా వేస్తున్నారు.

అయితే ఈ పెంపు ఇక్కడితో ఆగడం లేదు. తెలుగు రాష్ట్రాల్లోని మల్టీప్లెక్సుల్లో టికెట్ ధరలు మరింత పెరగనున్నాయి. దాదాపు ఆర్ఆర్ఆర్ సినిమా కోసం పెంచిన రేంజ్ లోనే సలార్ సినిమాకు కూడా టికెట్ రేట్లు పెరగనున్నాయి. దీన్ని బట్టి చూస్తే, హైదరాబాద్ మల్టీప్లెక్స్ లో సలార్ టికెట్ ధర అటుఇటుగా 350 రూపాయలు ఉండొచ్చు.

కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన చిత్రం సాలార్. ఈ చిత్రంలో ప్రభాస్ సరసన శృతిహాసన్ హీరోయిన్ గా నటించింది. జగపతిబాబు, పృథ్వీరాజ్ సుకుమారన్, ఈశ్వరీరావు కీలక పాత్రలు పోషిస్తున్నారు. రవి బస్రూర్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు. తాజాగా సినిమాకు సంబంధించి ఓ ఐటెంసాంగ్ కూడా షూట్ చేశారు.

First Published:  20 Nov 2023 4:38 PM GMT
Next Story