Telugu Global
Cinema & Entertainment

Salaar | జోరుగా నడిచిన 'బ్లాక్' దందా

Salaar - ప్రభాస్ హీరోగా నటించిన సలార్ సినిమా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా ఓపెన్ అయింది. అదే టైమ్ లో బ్లాక్ మార్కెట్ కూడా ఓపెన్ అయింది.

Salaar | జోరుగా నడిచిన బ్లాక్ దందా
X

సలార్ సినిమా థియేటర్లలోకి వచ్చింది. అర్థరాత్రి నుంచే నైజాంలో షోలు మొదలయ్యాయి. ఈ సినిమాకు ఆన్ లైన్ లో జోరుగా అడ్వాన్స్ బుకింగ్ నడిచింది. అయితే ఆఫ్-లైన్ లో అంతే జోరుగా బ్లాక్ మార్కెట్ దందా కూడా నడిచింది. హైదరాబాద్ లోని 2-3 సెంటర్లలో బెనిఫిట్ షో టికెట్లు 5-6 వేల రూపాయలకు కూడా అమ్మిన దాఖలాలున్నాయి.

అటు నైజాంలోని ఇతర ప్రాంతాల్లో కూడా సలార్ టికెట్లను బ్లాక్ లో 2వేల రూపాయల వరకు అమ్ముకున్నారు. సినిమాపై ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్ ను దృష్టిలో పెట్టుకొని ఇలా బ్లాక్ మార్కెట్ దందాకు తెరతీశారు.

ఆంధ్రా కూడా దీనికి అతీతం కాదు. అక్కడ మిడ్-నైట్ షోలు లేకపోవడంతో ఉదయం ఆటకు భారీగా డిమాండ్ ఏర్పడింది. ఫలితంగా సెంటర్ బట్టి 1500 రూపాయల నుంచి 2వేల రూపాయల వరకు టికెట్లు అమ్ముకున్నారు. ప్రభాస్ కు భారీగా ఫ్యాన్ బేస్ ఉన్న భీమవరంలో పబ్లిక్ గానే ఒక్కో టికెట్ ను 5వేల రూపాయలకు అమ్మారు. "మా హీరో స్థాయి ఇది" అని చెప్పుకోవడం కోసం ఈ పని చేశారు. సిటీ మొత్తం ప్రభాస్ ఫ్లెక్సీలతో నింపేశారు.

ఇలా భారీ హంగామాతో పాటు, భారీగా బ్లాక్ మార్కెట్ దందాతో థియేటర్లలోకి వచ్చింది సలార్ సినిమా. ప్రభాస్-ప్రశాంత్ నీల్ కాంబినేషన్ కావడంతో, నార్త్ బెల్ట్ లో కూడా ఈ సినిమాకు భారీగా ఓపెనింగ్స్ వచ్చాయి.

First Published:  22 Dec 2023 3:12 PM GMT
Next Story