Telugu Global
Cinema & Entertainment

సలార్ కొత్త విడుదల తేదీ ఇదే

ప్రభాస్ హీరోగా నటిస్తున్న సినిమా సలార్. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో పాన్ ఇండియా మూవీగా వస్తున్న ఈ సినిమాకు కొత్త రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు

సలార్ కొత్త విడుదల తేదీ ఇదే
X

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్‌, పాన్ ఇండియా డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ నీల్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న భారీ బ‌డ్జెట్ మూవీ 'సలార్'. హోంబ‌లే ఫిలింస్ బ్యాన‌ర్‌పై విజ‌య్ కిర‌గందూర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హై ఎక్స్‌పెక్టేష‌న్స్ క్రియేట్ చేసిన ఈ సినిమా వచ్చే ఏడాది సెప్టెంబ‌ర్ 28న రిలీజ్ అవుతోంది. ఈ మేరకు అధికారిక ప్రకటన వచ్చేసింది.

మూవీ అనౌన్స్‌మెంట్ నుంచే ఈ సినిమాపై అంచనాలున్నాయి. ఎప్పుడెప్పుడు ప్ర‌భాస్‌ను వెండితెర‌పై చూస్తామా అని అంద‌రూ ఎదురు చూస్తున్నారు. ఈ నేప‌థ్యంలో ఇండిపెండెన్స్ డే సంద‌ర్భంగా ప్ర‌భాస్ పాత్ర‌కు సంబంధించిన సరికొత్త లుక్‌ను విడుద‌ల చేయ‌టంతో పాటు రిలీజ్ డేట్ సెప్టెంబ‌ర్ 28, 2023గా అనౌన్స్ చేశారు.

'సలార్' ఔట్ అండ్ ఔట్ మాస్ యాక్ష‌న్ అడ్వెంచ‌ర‌స్ ఫిల్మ్‌. ఇండియా స‌హా యూర‌ప్‌, మిడిల్ ఈస్ట్‌, ఆఫ్రికాల‌లో ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. ప్ర‌స్తుతం సినిమా 50 శాతానికి పైగా షూటింగ్ పూర్త‌యింది. సినిమాలో విజువల్ ఎఫెక్టులకు చాలా ప్రాధాన్య‌ం ఉంది. దీంతో మేక‌ర్స్ ఫారిన్ స్టూడియోలో ఈ వ‌ర్క్ అంత‌టినీ పూర్తి చేయ‌టంలో బిజీగా ఉన్నారు.

కె.జి.య‌ఫ్ వంటి సెన్సేష‌నల్ బ్లాక్ బ‌స్ట‌ర్ త‌ర్వాత ప్ర‌శాంత్ నీల్ నుంచి వస్తున్న సినిమా కావడంతో, సలార్ పై భారీ అంచనాలున్నాయి.

అంద‌రూ ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తోన్న స‌లార్ సినిమాలో ప్ర‌భాస్ ఇప్ప‌టి వ‌ర‌కు చేయ‌న‌టువంటి మాస్ అండ్ రా క్యారెక్ట‌ర్‌తో మెప్పించ‌బోతున్నారు. ఆయ‌న‌ స‌ర‌స‌న శ్రుతీ హాస‌న్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. పాన్ ఇండియా లెవ‌ల్లో తెలుగు, హిందీ, త‌మిళ‌, క‌న్న‌డ‌, మల‌యాళ భాష‌ల్లో స‌లార్ మూవీ రిలీజ్ అవుతుంది. ఇంకా ఈ చిత్రంలో పృథ్వీరాజ్ సుకుమారన్‌, జ‌గ‌ప‌తి బాబు, ఈశ్వ‌రీ రెడ్డి, శ్రియా రెడ్డి తదిత‌రులు ఇత‌ర కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ఈ సినిమా బడ్జెట్ 400 కోట్ల రూపాయలు.

Next Story