Telugu Global
Cinema & Entertainment

Salaar Box Office Collection | రూ.600 కోట్ల క్లబ్ లో చేరిన సలార్

Salaar Box Office Collection | ప్రభాస్ హీరోగా నటించిన సలార్ సినిమా 600 కోట్ల క్లబ్ లో చేరింది. ఈరోజు రాత్రి నుంచి ఈ సినిమా ఓటీటీలోకి వస్తోంది.

Salaar Box Office Collection |  రూ.600 కోట్ల క్లబ్ లో చేరిన సలార్
X

Salaar Box Office Collection | ప్రభాస్ సినిమాలు బాక్సాఫీస్ రికార్డులు సృష్టించడం కొత్త కాదు. సలార్ సినిమా కూడా దీనికి మినహాయింపు కాదు. తాజాగా ఈ సినిమా 600 కోట్ల రూపాయల క్లబ్ లో చేరింది.

ప్రభాస్ హీరోగా, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన సలార్ సినిమా థియేటర్లలోకి వచ్చి తాజాగా 4 వారాలు పూర్తయింది. దీంతో ఈ సినిమా రన్ దాదాపు ముగినట్టుగా చెప్పుకోవాలి. ఈ 4 వారాల్లో సినిమాకు ప్రపంచవ్యాప్తంగా 615 కోట్ల రూపాయల వసూళ్లు వచ్చాయి.

ఈ సినిమా తెలుగు వెర్షన్ కు 257 కోట్ల రూపాయల గ్రాస్ రాగా.. ఓవర్సీస్ నుంచి 135 కోట్ల రూపాయల వసూళ్లు వచ్చాయి. కన్నడనాట ఈ సినిమా పెద్దగా ఆడలేదు.

తాజాగా ఈ సినిమాకు మరోసారి ప్రచారం ప్రారంభించారు. ప్రభాస్, శృతిహాసన్, పృధ్వీరాజ్ సుకుమారన్ లను కూర్చోబెట్టి ఇంటర్వ్యూ చేశారు. అది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే సంక్రాంతి సినిమాల రాకతో, సలార్ మూవీ పెద్దగా ప్రభావం చూపించకపోవచ్చు. పైగా ఈ రాత్రి నుంచి నెట్ ఫ్లిక్స్ లో ఈ సినిమా స్ట్రీమింగ్ కు రాబోతోంది.

First Published:  19 Jan 2024 4:32 PM GMT
Next Story