Telugu Global
Cinema & Entertainment

రామ్ సరసన 'ఏజెంట్' బ్యూటీ

త్వరలోనే సెట్స్ ఫైకి రానుంది రామ్, బోయపాటి సినిమా. ఈ మూవీలో హీరోయిన్ గా సాక్షి వైద్య ను తీసుకున్నారట.

రామ్ సరసన ఏజెంట్ బ్యూటీ
X

రామ్ సరసన 'ఏజెంట్' బ్యూటీ సెట్స్ పైకి రాబోతోంది రామ్-బోయపాటి సినిమా. చాన్నాళ్ల కిందటే ఈ సినిమా ఓపెనింగ్ జరిగింది. కానీ రెగ్యులర్ షూటింగ్ కు మాత్రం టైమ్ తీసుకున్నారు. ఈ గ్యాప్ లో హీరోయిన్ ను ఫిక్స్ చేశారు.


రామ్-బోయపాటి సినిమాలో హీరోయిన్ గా సాక్షి వైద్యను తీసుకున్నట్టు తెలుస్తోంది. అఖిల్ హీరోగా నటిస్తున్న ఏజెంట్ సినిమాతో ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ కు పరిచయమౌతోంది. రామ్-బోయపాటి సినిమా ఈమెకు రెండో తెలుగు ప్రాజెక్ట్ అవుతుంది.


ఇక షూటింగ్ అప్ డేట్స్ విషయానికొస్తే.. అక్టోబర్ 6 నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టాలని భావిస్తున్నారు. తమన్ ఈ సినిమాకు సంగీతం అందించబోతున్నాడు.


శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్స్ బ్యానర్ పై శ్రీనివాసా చిట్టూరి ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. వచ్చే ఏడాది సమ్మర్ కు సినిమాను విడుదల చేయాలని టార్గెట్ గా పెట్టుకున్నారు. ఈ మూవీ పూర్తయిన తర్వాత, గౌతమ్ మీనన్ దర్శకత్వంలో సినిమా చేస్తాడు రామ్.

First Published:  28 Sep 2022 12:07 PM GMT
Next Story