Telugu Global
Cinema & Entertainment

Saindhav OTT: అందరికంటే ముందు సైంధవ్

Saindhav OTT release: సంక్రాంతి బరిలో నిలిచిన సైంధవ్ సినిమా ఫ్లాప్ అయింది. ఇప్పుడీ సినిమా త్వరలోనే ఓటీటీలో ప్రత్యక్షం కానుంది.

Saindhav OTT: అందరికంటే ముందు సైంధవ్
X

సంక్రాంతి బరిలో నిలిచిన సైంధవ్ సినిమా ఫ్లాప్ అయింది. వెంకటేష్ కెరీర్ లో ప్రతిష్టాత్మక 75వ చిత్రంగా తెరకెక్కిన ఈ మూవీ ఆకట్టుకోలేకపోయింది. ఫలితంగా సంక్రాంతి బరిలో క్లియర్ ఫ్లాప్ అయింది. అందుకే అందరికంటే ముందే ఓటీటీలోకి వచ్చేస్తోంది ఈ మూవీ.

సంక్రాంతి సినిమాల్లో అన్నింటికంటే ముందుగా ఓటీటీలోకి వస్తోంది సైంధవ్ సినిమా. మరికొన్ని రోజుల్లో ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కు రాబోతోంది. దీనికి సంబంధించి రేపోమాపో అధికారిక ప్రకటన రాబోతోంది. ఈ సినిమా శాటిలైట్ రైట్స్ ను ఈటీవీ దక్కించుకున్న సంగతి తెలిసిందే.

సైంధవ్ తర్వాత గుంటూరుకారం ఓటీటీలోకి వచ్చే అవకాశం ఉంది. నెట్ ఫ్లిక్స్ లో ఫిబ్రవరి రెండో వారం నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ కు వచ్చే అవకాశం ఉంది.

ఇక హనుమాన్, నా సామిరంగ సినిమాల స్ట్రీమింగ్ డేట్స్ పై ఇంకా క్లారిటీ రాలేదు. హనుమాన్ సినిమా జీ5లో, నా సామిరంగ మూవీ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కు రానున్నాయి.

First Published:  30 Jan 2024 4:47 PM GMT
Next Story