Telugu Global
Cinema & Entertainment

Saindhav | ఓటీటీలోకి సైంధవ్

Saindhav - వెంకీ నటించిన సైంధవ్ సినిమా ఈ వీకెండ్ ఎట్రాక్షన్ గా ఓటీటీలోకి రాబోతోంది. అమెజాన్ ప్రైమ్ లో ఈ సినిమాను స్ట్రీమింగ్ కు పెట్టబోతున్నారు.

Saindhav | ఓటీటీలోకి సైంధవ్
X

శైలేష్ కొలను దర్శకత్వంలో వెంకట్‌ బోయినపల్లి నిర్మాతగా నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై వెంకటేష్‌ దగ్గుబాటి హీరోగా నటించిన చిత్రం సైంధవ్. ఈ చిత్రంలో శ్రద్ధా శ్రీనాథ్‌, రుహానీ శర్మ, నవాజుద్దీన్‌ సిద్ధిఖీ, ఆర్య, ఆండ్రియా జెర్మియా ప్రధాన పాత్రల్లో నటించారు.

వెంకీ కెరీర్ లో ప్రతిష్టాత్మక 75వ చిత్రం ఇది. సంక్రాంతి బరిలో రిలీజ్ అయిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వస్తోంది. భారతదేశం సహ ప్రపంచవ్యాప్తంగా 240 దేశాలు, ప్రాదేశిక ప్రాంతాల్లో ఈ యాక్షన్‌ థ్రిల్లర్‌ చిత్రాన్నితెలుగుతో పాటు తమిళ్ లో ఫిబ్రవరి 3 నుంచి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కు ఉంచుతారు.

కదిలించే భావోద్వేగాలు, కట్టిపడేసే యాక్షన్‌తో కూడిన ఈ చిత్రంలో వెంకటేష్‌ దగ్గుబాటి సైంధవ్‌ కోనేరు అలియాస్‌ సైకో పాత్రలో నటించారు. బాధకరమైన గతాన్ని కలిగిన సైకో, వాటిని పక్కన పెట్టి కూతురు గాయత్రితో కలిసి బాధ్యతాయుతమైన తండ్రిగా ఒక సాధారణ జీవితాన్ని జీవిస్తూ ఉంటాడు. అయితే గాయత్రికి ప్రాణాంతకమైన వ్యాధి ఉన్నట్టు తేలడంతో ఆ ప్రశాంతత చెదిరిపోతుంది.

కఠినమైన పరిస్థితిని ఎదుర్కొన్న సైకో తన కూతురిని ఎలాగైనా కాపాడుకోవాలనే నిశ్చయంతో చీకటి సామ్రాజ్యంలోకి ప్రవేశిస్తాడు. దీంతో పాత విరోధులతో మళ్లీ పోరాటం చేయాల్సిన పరిస్థితి తలెత్తుతుంది. ఈ చిత్రంలో పోషించిన కరుడుగట్టిన గ్యాంగ్‌స్టర్‌ పాత్ర వికాస్‌ మాలిక్‌ ద్వారా నవాజుద్దీన్‌ సిద్ధిఖీ తెలుగులోకి తెరంగేట్రం చేశారు. చివరికి వెంకీ తన కూతుర్ని రక్షించుకున్నాడా లేదా అనేది స్టోరీ.

First Published:  31 Jan 2024 5:22 PM GMT
Next Story