Telugu Global
Cinema & Entertainment

Saindhav Movie | క్లైమాక్స్ పూర్తి చేసిన సైంధవ్

Saindhav Movie - వెంకీ నటిస్తున్న తాజా చిత్రం సైంధవ్. కెరీర్ లో వెంకీకి ఇది 75వ చిత్రం కావడం విశేషం.

Saindhav Movie | క్లైమాక్స్ పూర్తి చేసిన సైంధవ్
X

నిర్మాత వెంకట్ బోయనపల్లి తన తొలి చిత్రం ‘శ్యామ్ సింగరాయ్‌’ ని గ్రాండ్ గా నిర్మించి సినిమాపై తనకున్న అభిరుచిని చాటుకున్నాడు. ప్రస్తుతం వెంకటేష్ హీరోగా, శైలేష్ కొలను దర్శకత్వంలో నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై ‘సైంధవ్‘ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు.

‘సైంధవ్’ వెంకటేష్ 75వ మైల్ స్టోన్ మూవీ. అందుకే మేకర్స్ చాలా జాగ్రత్తలు తీసుకొని, ఎక్కడా రాజీపడకుండా నిర్మిస్తున్నారు. తాజాగా 16 రోజులలో కీలకమైన షెడ్యూల్‌ను పూర్తి చేశారు, 8 మంది ముఖ్య నటీనటులు షూట్‌లో పాల్గొనగా.. క్లైమాక్స్‌ పార్ట్ ను షూట్ చేశారు.

ఈ యాక్షన్ ఎపిసోడ్‌ను రామ్-లక్ష్మణ్ మాస్టర్స్ పర్యవేక్షించారు. వెంకటేష్‌ కెరీర్ లో ఇప్పటివరకు ఇదే భారీ ఖర్చుతో కూడుకున్న క్లయిమాక్స్ అని మేకర్స్ చెబుతున్నారు.

ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే.. నవాజుద్దీన్ సిద్ధికి, శ్రద్ధా శ్రీనాథ్, రుహాని శర్మ, ఆండ్రియా, సారాతో సహా దాదాపు అన్ని ప్రధాన పాత్రలను మేకర్స్ పరిచయం చేశారు. ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నాడు. పాన్ ఇండియా మూవీగా అన్ని దక్షిణాది భాషలతో పాటు, హిందీలో డిసెంబర్ 22న క్రిస్మస్ కానుకగా విడుదల కానుంది సైంధవ్.

First Published:  13 Aug 2023 2:47 PM GMT
Next Story