Telugu Global
Cinema & Entertainment

Saindhav | పాటలతో సందడి చేయనున్న సైంధవుడు

Saindhav Movie - వెంకీ కెరీర్ లో 75వ సినిమా సైంధవ్. ఈ మూవీ మ్యూజికల్ ప్రమోషన్స్ కు డేట్ లాక్ చేశారు.

Saindhav | పాటలతో సందడి చేయనున్న సైంధవుడు
X

విక్టరీ వెంకటేష్ 75వ ల్యాండ్‌మార్క్ చిత్రం ‘సైంధవ్’. 2024లో విడుదలవుతున్న మోస్ట్ ఎవైటెడ్ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌లలో ఒకటి. శైలేష్ కొలను దర్శకత్వం వహించిన ఈ చిత్రం సంక్రాంతికి విడుదలకు సిద్ధమవుతోంది. ఇప్పుడీ సినిమా మ్యూజికల్ ప్రమోషన్స్ కు రంగం సిద్ధమైంది.

నవంబర్ 21న సినిమా ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేయబోతున్నారు. 'రాంగ్ యూసేజ్‌' అనే లిరిక్స్ తో సాగే ఈ పాటతో మ్యూజికల్ ప్రమోషన్స్ మొదలవుతాయి. ఈ సందర్భంగా మరో పోస్టర్ రిలీజ్ చేశారు. సాంగ్ పోస్టర్‌లో వెంకటేష్ డ్యాన్సర్‌లతో కలిసి మాస్ డ్యాన్స్‌ చేస్తున్నట్లు కనిపించారు. సంతోష్ నారాయణన్ ఈ సినిమాకు సంగీత దర్శకుడు.

గత నెలలో విడుదల చేసిన ఈ సినిమా టీజర్‌కి మంచి స్పందన వచ్చింది. శైలేష్ కొలను, వెంకటేష్‌ని మునుపెన్నడూ లేని ఇంటెన్స్ అవతార్‌లో ప్రెజెంట్ చేశారని ప్రశంసలు అందుకున్నాడు. నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై వెంకట్ బోయనపల్లి గ్రాండ్ గా నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎస్.మణికందన్ సినిమాటోగ్రాఫర్.

నవాజుద్దీన్ సిద్ధిఖీ, ఆర్య, శ్రద్ధా శ్రీనాథ్, రుహాని శర్మ, ఆండ్రియా, బేబీ సారా, జయప్రకాష్‌లు ఈ సినిమాలో ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.

‘సైంధవ్’ జనవరి 13న అన్ని దక్షిణ భారత భాషలతో పాటు, హిందీలో విడుదల కానుంది. వెంకటేష్ కెరీర్ లో ఫుల్ లెంగ్త్ పాన్ ఇండియా రిలీజ్ ఇదే.

First Published:  14 Nov 2023 3:25 PM GMT
Next Story