Telugu Global
Cinema & Entertainment

Venkatesh | కర్చీఫులు రెడీ చేసుకోండి

Venkatesh - సైంధవ్ సినిమాలో యాక్షన్ మాత్రమే కాదు, ఫుల్ సెంటిమెంట్ కూడా ఉందంటున్నారు వెంకీ. ప్రేక్షకులు కర్చీఫుల్ రెడీ చేసుకోవాలని చెబుతున్నారు.

Saindhav OTT: అందరికంటే ముందు సైంధవ్
X

వెంకటేష్ కెరీర్ లో 75వ చిత్రం సైంధవ్. కెరీర్ మైల్ స్టోన్ మూవీ చేస్తున్నప్పుడు కచ్చితంగా తన బలం ఏంటో తెలుసుకొని మరీ వెంకటేష్ రంగంలోకి దిగి ఉండాలి. అయితే అది యాక్షన్ కాదు, అంతకంటే ఎక్కువగా సెంటిమెంట్ ఆయన బలం.

మరి సైంధవ్ లో సెంటిమెంట్ ఉందా? ఈ ప్రశ్నకు సమాధానం తాజాగా రిలీజైన ట్రయిలర్. చూడ్డానికి యాక్షన్ మూవీలా కనిపిస్తున్నప్పటికీ, ఇది పక్కా తండ్రీకూతురు సెంటిమెంట్ తో తెరకెక్కిందనే విషయం ట్రయిలర్ చూస్తే అర్థమౌతుంది. తన ప్రాణంతో సమానమైన కూతురుకు అరుదైన జబ్బు వస్తే ఆ తండ్రి ఏం చేస్తాడనేది ట్రయిలర్ లో చూపించారు.

తన బలం సెంటిమెంట్ అనే విషయం వెంకీకి బాగా తెలుసు. అందుకే సైంధవ్ లో సెంటిమెంట్ పాళ్లు కాస్త ఎక్కువగానే దట్టించారు. 'కర్చీఫ్ లు రెడీ చేసుకోండి' అంటూ స్వయంగా వెంకీ స్టేట్ మెంట్ ఇచ్చారంటే సైంధవ్ లో సెంటిమెంట్, ఎమోషన్ ఏ రేంజ్ లో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.

అయితే ప్రస్తుతం యాక్షన్ సినిమాల ట్రెండ్ నడుస్తుండడం వల్ల, దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రారంభం నుంచి సైంధవ్ కు యాక్షన్ ఇమేజ్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నట్టున్నారు. ట్రయిలర్ లో కూడా స్టయిలిష్ యాక్షన్ ఎలిమెంట్స్ చూపించారు.

అయితే వెంకీ చెప్పినట్టు... ఇందులో యాక్షన్ తో పాటు హెవీగా ఎమోషన్ కూడా ఉండబోతోంది. బహుశా అందుకేనేమో తమది పెర్ ఫెక్ట్ సంక్రాంతి సినిమా అంటోంది యూనిట్. మూవీ చూసిన తర్వాత అంతా ఇదే మాట అంటారని కూడా నమ్మకంగా చెబుతున్నారు.

First Published:  5 Jan 2024 12:52 AM GMT
Next Story