Telugu Global
Cinema & Entertainment

Sailesh Kolanu: ఎవెంజర్స్ టైపులో హిట్ ఫ్రాంచైజీ

Sailesh Kolanu: హిట్-2 సినిమాతో థియేటర్లలోకి వస్తున్నాడు శైలేష్ కొలను. రాబోయే రోజుల్లో ఎవెంజర్స్ తరహా స్క్రీన్ ప్లేతో హిట్ ఫ్రాంచైజీని నడిపిస్తానని ప్రకటించాడు.

Sailesh Kolanu: ఎవెంజర్స్ టైపులో హిట్ ఫ్రాంచైజీ
X

హాలీవుడ్ ఎవెంజర్స్ ఫ్రాంచైజీ ఫాలో అయ్యే వాళ్లకు అందరికీ, ఆ సినిమాల్లో కాన్సెప్టులు ఎలా ఉంటాయో తెలుసు. ఇద్దరు ముగ్గురు హీరోల్ని మిక్స్ చేసి కథ రాసుకోవడం ఆ ఫ్రాంచైజీ స్పెషాలిటీ. ఇప్పుడు ఇదే తరహాలో రాబోయే రోజుల్లో హిట్ సినిమాకు సీక్వెల్స్ తీస్తానని ప్రకటించాడు దర్శకుడు శైలేష్ కొలను.

"ముందుగా ఈ ఫ్రాంచైజీని కొత్తగా ప్లాన్ చేశాం. ఒక్కో ఆఫీసర్‌ను పరిచయం చేయడం, ఆయన స్టోరీని చెప్పిన తర్వాత మరో ఆఫీసర్ ను పరిచయం చేయడం లాంటివి చేద్దాం అనుకున్నాను. కానీ ఇప్పుడు ఒక్కో ఆఫీసర్‌ను పరిచయం చేస్తూ.. చివరకు అందరు ఆఫీసర్లను కలిపేద్దామని ఫిక్స్ అయ్యాను. అవెంజర్స్‌లా స్టోరీ రాసుకుంటే బాగుంటుందని అనుకున్నాను. ఇదే విశ్వక్ సేన్‌కు కూడా చెప్పాను. ఓకే అన్నాడు. మున్ముందు విశ్వక్ కూడా హిట్ ఫ్రాంచైజీలో కనిపిస్తాడు."

ఇలా హిట్ ఫ్రాంచైజీకి సంబంధించి తన మనసులో మాట బయటపెట్టాడు ఈ దర్శకుడు. 'హిట్ ది ఫస్ట్ కేస్' అనే క్రైమ్ థ్రిల్లర్‌తో దర్శకుడిగా తెరంగేట్రం చేసి టైటిల్‌కు త‌గ్గ‌ట్టే హిట్ సాధించాడు శైలేష్ కొల‌ను. ఇప్పుడు హిట్ యూనివ‌ర్స్‌ని రూపొందించాడు. అందులో భాగంగా హిట్ సినిమాకు ఫ్రాంచైజీగా మ‌రో చిత్రం 'హిట్ 2 - ది సెకండ్ కేస్' తీశాడు.

అడివి శేష్ హీరోగా న‌టించిన ఈ సినిమాను... నాని స‌మ‌ర్ప‌ణ‌లో వాల్ పోస్ట‌ర్ సినిమా బ్యాన‌ర్‌పై ప్ర‌శాంతి త్రిపిర్‌నేని నిర్మించింది. హిట్ 2 మూవీ డిసెంబ‌ర్ 2న రిలీజ్ అవుతోంది.

First Published:  30 Nov 2022 11:08 AM GMT
Next Story