Telugu Global
Cinema & Entertainment

HIT 2 Movie: తన ప్రపంచంలోకి ప్రేక్షకుల్ని తీసుకెళ్లిన దర్శకుడు

HIT 2 Teaser release date: హిట్ 2 టీజర్ రిలీజ్ డేట్ ప్రకటించాడు దర్శకుడు శైలేష్ కొలను. ఈ సందర్భంగా హిట్ యూనివర్స్ లోకి ప్రేక్షకుల్ని తీసుకెళ్లాడు.

HIT 2 Movie: తన ప్రపంచంలోకి ప్రేక్షకుల్ని తీసుకెళ్లిన దర్శకుడు
X

క్షణం, గూఢచారి, ఎవరు వంటి వైవిధ్యమైన చిత్రాల్లో హీరోగా మెప్పించి మేజర్ చిత్రంతో పాన్ ఇండియా రేంజ్‌లో తనదైన గుర్తింపు సంపాదించుకున్న హీరో అడివి శేష్. ఆయన హీరోగా శైలేష్ కొలను దర్శకత్వంలో రూపొందుతోన్న క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ 'హిట్ 2'. 'ది సెకండ్ కేస్' ట్యాగ్ లైన్.

ఈ చిత్రానికి మొదటి భాగంగా వచ్చిన 'హిట్' సినిమా ప్రేక్షకులను మెస్మరైజ్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు హిట్ 2 చిత్రం త్వరలోనే ప్రేక్షకులను అలరించనుంది. చిత్రీకరణ చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటుంది.

మీనాక్షి చాదరి ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తుంది. వాల్ పోస్టర్ సినిమా బ్యానర్‌పై నాని, ప్రశాంతి త్రిపిరినేని ఈ సినిమాను నిర్మించారు. తాజాగా హిట్ యూనివర్స్ ను పరిచయం చేశాడు దర్శకుడు శైలేష్ కొలను. ఈ వీడియోతో డైరెక్టర్ హిట్ ప్రపంచాన్ని అందరికీ పరిచయం చేశాడు.

కె.డి పాత్రలో అడివి శేష్.. చాలా కూల్‌ కాప్‌గా ఎలా ఉంటాడో ఎలివేట్ చేశాడు. థ్రిల్, యాక్షన్, ఫన్ వంటివి కూడా ఈ సినిమాలో ఎక్కువగా ఉంటాయని చెప్పాడు. ఇందులో హిట్ 1 మరియు హిట్ 2 మధ్య సంబంధం ఉందని కూడా రివీల్ చేశాడు. విశ్వక్ సేన్ ను కాకుండా, శేష్ ను ఎందుకు తీసుకున్నామో కూడా చెప్పాడు.

చివరగా వీడియోలోకి అడివి శేష్ ఎంట్రీ ఇచ్చి ఆశ్చర్యపరిచాడు. మూవీ టీజర్ డేట్‌ను నవంబర్ 3న రిలీజ్ చేయబోతున్నట్లు అనౌన్స్ చేశారు. ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం డిసెంబర్ 2న విడుదలకానుంది.



First Published:  1 Nov 2022 2:42 AM GMT
Next Story