Telugu Global
Cinema & Entertainment

మరో విలక్షణ పాత్రలో సాయికుమార్

విలక్షణ పాత్రలకు పెట్టింది పేరు సాయికుమార్. ఇప్పుడీ సీనియర్ నటుడు మరో డిఫరెంట్ రోల్ చేశాడు.

మరో విలక్షణ పాత్రలో సాయికుమార్
X

విలక్షణ పాత్రలకు పెట్టింది పేరు సాయికుమార్. ఇప్పుడీ సీనియర్ నటుడు మరో పాత్రలోకి పరకాయ ప్రవేశం చేశారు. ఆ సినిమా పేరు "అరి".

పేపర్ బాయ్ సినిమాతో ప్రతిభ గల దర్శకుడిగా పేరు తెచ్చుకున్న జయశంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది అరి. ఈ సినిమాలో సాయి కుమార్ నటిస్తున్న ప్రైడ్ క్యారెక్టర్ లుక్ ను విడుదల చేశారు. సాయికుమార్ తనయుడు, హీరో ఆది సాయికుమార్ చేతుల మీదుగా విడుదలైన ఈ ఫస్ట్ లుక్ లో నెగిటివ్ షేడ్స్ లో కనిపిస్తున్నారు సాయికుమార్.

అనసూయ, సాయి కుమార్, శ్రీకాంత్ అయ్యంగార్, వైవా హర్ష, శ్రీనివాస రెడ్డి, చమ్మక్ చంద్ర తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా "అరి". మై నేమ్ ఈజ్ నో బడీ అనేది ట్యాగ్ లైన్. ఈ సినిమాకు పెట్టుకున్న బ్యాడ్ ఈజ్ న్యూ గుడ్ అనే క్యాప్షన్ ఇంట్రెస్ట్ క్రియేట్ చేసేలా ఉంది. ఈ చిత్రాన్నిఆర్వీ రెడ్డి సమర్పణలో అర్వీ సినిమాస్ పతాకంపై శ్రీనివాస్ రామిరెడ్డి, శేషు మారంరెడ్డి నిర్మిస్తున్నారు.

మనిషి ఎలా బతకకూడదు అనే విషయాన్ని ఈ సినిమా ద్వారా ఆసక్తికరంగా చూపించబోతున్నారు. ప్రస్తుతం అరి సినిమా చిత్రీకరణ పూర్తి చేసుకుంది. త్వరలో విడుదల తేదీని ప్రకటించనున్నారు. టైటిల్ కు అర్థం ఏంటనేది ప్రస్తుతానికి సస్పెన్స్.

First Published:  9 Oct 2022 8:28 AM GMT
Next Story