Telugu Global
Cinema & Entertainment

Jr NTR: ఎన్టీఆర్ సినిమాలో సైఫ్ అలీఖాన్

Saif Ali Khan in Jr NTR Movie - ఎన్టీఆర్-కొరటాల శివ సినిమాలో నటించేందుకు సైఫ్ అలీఖాన్ అంగీకరించాడు. ఇందులో విలన్ గా కనిపించబోతున్నాడు సైఫ్.

Jr NTR, Janhvi Kapoor Movie: ఎన్టీఆర్-కొరటాల సినిమా మొదలైంది
X

Jr NTR, Janhvi Kapoor Movie: ఎన్టీఆర్-కొరటాల సినిమా మొదలైంది

కొరటాల శివ, ఎన్టీఆర్ కాంబోలో వస్తున్న సినిమాలో సైఫ్ అలీఖాన్ ను విలన్ పాత్ర కోసం తీసుకుంటున్నట్టు ఇప్పటికే వార్తలొచ్చాయి. ఇప్పుడవే నిజమయ్యాయి. #NTR30 లో విలన్‌గా నటించడానికి సైఫ్ అలీఖాన్ అంగీకరించాడు. ఈ మేరకు అగ్రిమెంట్ జరిగినట్టు తెలుస్తోంది.

నిజానికి ఈ ప్రాజెక్ట్ నుంచి సైఫ్ తప్పుకున్నట్టు నిన్నటివరకు వార్తలొచ్చాయి. ఈ పుకార్లు అవాస్తవమని, అతను ఇప్పటికే ప్రాజెక్ట్‌పై సంతకం చేశాడని తెలుస్తోంది. సైఫ్ పేరును ఈ నెలాఖరులో ప్రకటిస్తారు.

సైఫ్ అలీఖాన్ ఈ చిత్రంలో మెయిన్ విలన్ గా కనిపించనున్నాడు. సైఫ్ నటిస్తున్న రెండో తెలుగు సినిమా ఇది. ప్రభాస్ 'ఆదిపురుష్' తో సౌత్ లోకి ఎంట్రీ ఇస్తున్నాడు సైఫ్.

కోస్తా ప్రాంతాలు నేపథ్యంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు ఇంకా టైటిల్ ఫిక్స్ చేయలేదు. ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్‌ హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే తొలి షెడ్యూల్ పూర్తయింది. తదుపరి షెడ్యూల్ నెలాఖరుకు మొదలవుతుంది.

అనిరుధ్ రవిచందర్ సంగీతం సమకూరుస్తున్న ఈ ప్రాజెక్టుకు సుధాకర్ మిక్కిలినేని, హరికృష్ణ నిర్మాతలు. వచ్చే ఏడాది సమ్మర్ ఎట్రాక్షన్ గా ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నారు.

First Published:  13 April 2023 12:39 PM GMT
Next Story