Telugu Global
Cinema & Entertainment

Virupaksha: సాయిధరమ్ తేజ్ సినిమాకు టైటిల్ ఫిక్స్

Sai tej's Virupaksha: సాయిధరమ్ తేజ్ కొత్త సినిమాకు టైటిల్ ఫిక్స్ చేశారు. అంతేకాదు, ఒకేసారి గ్లింప్స్ విడుదల చేయడంతో పాటు, రిలీజ్ డేట్ కూడా ఎనౌన్స్ చేశారు.

Virupaksha: సాయిధరమ్ తేజ్ సినిమాకు టైటిల్ ఫిక్స్
X

సాయిధరమ్‌ తేజ్‌ నటిస్తున్న తొలి పాన్‌ ఇండియా మూవీకి 'విరూపాక్ష' అనే టైటిల్‌ని నిర్ణయించారు. ఈరోజు హైదరాబాద్‌లోని ప్రసాద్‌ ఐమ్యాక్స్‌లో బిగ్‌ స్క్రీన్‌పై ఈ చిత్రం టైటిల్‌ గ్లింప్స్‌ను విడుదల చేశారు. ఎన్టీఆర్‌ వాయిస్‌ ఓవర్‌తో ప్రారంభమైన ఈ గ్లింప్స్‌కు మంచి స్పందన వచ్చింది.

శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర, సుకుమార్‌ రైటింగ్స్‌ కలిసి ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. బీఎస్‌ఎన్‌ ప్రసాద్‌ నిర్మాత. హీరో సాయిధరమ్‌ తేజ్‌ ఈ చిత్రం టైటిల్‌ గ్లింప్స్‌ను విడుదల చేశారు. కెరీర్ లో సాయిధరమ్ తేజ్ చేస్తున్న తొలి మిస్టీరియర్ థ్రిల్లర్ సినిమా ఇదే.

1990 బ్యాక్ డ్రాప్ లో అడవి మధ్యలో ఉండే ఓ చిన్న గ్రామంలో జరిగే కథ ఇది. అక్కడ జరిగే కొత్త, వింత పరిణామాలను హీరో ఎలా ఎదుర్కొన్నాడనేది ఆసక్తికరంగా ఉంటుంది. సుకుమార్‌ ఈ సినిమాకు స్క్రీన్ ప్లే అందించడం విశేషం. కార్తీక్ దండు దర్శకత్వం వహించాడు.

తెలుగులో రాబోతున్న మరో ఇంటర్నేషనల్‌ స్టాండర్డ్‌ సినిమాగా 'విరూపాక్ష'ను చెబుతున్నారు మేకర్స్. అజనీష్‌ లోక్‌నాథ్‌ ఈ సినిమాకు సంగీతం అందించాడు. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో వచ్చే ఏడాది ఏప్రిల్‌ 21న విడుదలవుతుంది.



First Published:  7 Dec 2022 12:46 PM GMT
Next Story