Telugu Global
Cinema & Entertainment

Virupaksha Movie: విరూపాక్ష ఇండస్ట్రీ హిట్ అంటున్న హీరో

Virupaksha Movie: విరూపాక్ష విజయాన్ని ఇండస్ట్రీకి అంకితం చేశాడు సాయిధరమ్ తేజ్. ఇది ప్రేక్షకుల విజయం అంటున్నాడు.

Virupaksha Movie: విరూపాక్ష ఇండస్ట్రీ హిట్ అంటున్న హీరో
X

Virupaksha Movie: విరూపాక్ష ఇండస్ట్రీ హిట్ అంటున్న హీరో

సాయిధరమ్ తేజ్ హీరోగా నటించిన సినిమా విరూపాక్ష. గత శుక్రవారం థియేటర్లలో రిలీజైన ఈ సినిమా హిట్టయింది. విమర్శకుల ప్రశంసలతో పాటు, ప్రేక్షకుల ఆదరణ పొందింది. అయితే ఈ సినిమా సక్సెస్ క్రెడిట్ తమ యూనిట్ ది మాత్రమే కాదంటున్నాడు హీరో సాయితేజ్. టోటల్ ఇండస్ట్రీకి ఆ క్రెడిట్ ఇస్తున్నాడు.

"విరూపాక్ష సినిమా స‌క్సెస్ నాదో, మా టీమ్‌దో కాదు. మన ఆడియెన్స్‌ది. గ‌త ఏడాది కొన్ని సినిమాల‌కు జ‌నాలు రాలేదు. ఎందుకంటే వాళ్లు మాకు చాలెంజ్ విసిరారు. మేం థియేట‌ర్స్‌కు రావాలంటే అలాంటి సినిమాలు మీరు చేయండ‌ని చెప్పారు. ఆ చాలెంజ్‌కి ఆన్స‌రే విరూపాక్ష‌. అందుకే ఇది మా విజయం కాదు, ఆడియన్స్ విజయం, ఇండస్ట్రీ విజయం."

సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా మిస్టిక్ థ్రిల్లర్ కాన్సెప్ట్ తో తెరకెక్కింది. కార్తీక్ దండు ఈ సినిమాకు దర్శకుడు. అజనీష్ లోకనాధ్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకు బాగా హెల్ప్ అయింది.

First Published:  24 April 2023 2:37 AM GMT
Next Story