Telugu Global
Cinema & Entertainment

అమీర్‌ఖాన్‌ కొడుకుతో సాయిపల్లవి ప్రేమాయణం..వైరల్ అవుతున్న ఫోటోలు

అమీర్‌ఖాన్‌ కుమారుడు జునైద్ ఖాన్ బాలీవుడ్‌లో హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ సినిమాలో టాలీవుడ్ స్టార్ న‌టి సాయి ప‌ల్లవి హీరోయిన్‌గా న‌టిస్తోంది.

అమీర్‌ఖాన్‌ కొడుకుతో సాయిపల్లవి ప్రేమాయణం..వైరల్ అవుతున్న ఫోటోలు
X

జపాన్‌లో ప్రతి సంవత్సరం ఫిబ్రవరిలో సపోరో స్నో ఫెస్టివల్ జ‌రుగుతుంది. ఈ ఫెస్టివల్‌ను చూడటానికి ప్రపంచం నలుమూలల నుంచి పర్యాటకులు వస్తుంటారు. ఇదే ఫెస్టివల్‌లో బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్‌ఖాన్‌ కొడుకు, సాయిపల్లవి సందడి చేశారు. ఇపుడీ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్‌ అవుతున్నాయి.

మ్యాటర్‌ ఏంటంటే.. అమీర్‌ఖాన్‌ కుమారుడు జునైద్ ఖాన్ బాలీవుడ్‌లో హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ సినిమాలో టాలీవుడ్ స్టార్ న‌టి సాయి ప‌ల్లవి హీరోయిన్‌గా న‌టిస్తోంది. ప్రేమకథతో తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి సునీల్‌పాండే దర్శకత్వం వహిస్తున్నాడు. యశ్‌రాజ్‌ ఫిలింస్ బ్యానర్‌లో వ‌స్తున్న ఈ ప్రాజెక్ట్‌ ప్రస్తుతం జపాన్‌లో షూటింగ్ జ‌రుపుకుంటోంది. షూటింగ్‌ బ్రేక్‌లో జునైద్ ఖాన్, సాయి ప‌ల్లవి సపోరో స్నో ఫెస్టివల్‌లో సంద‌డి చేశారు. ఏడాది చివర్లో సినిమాను రిలీజ్ చేయాలని మేకర్స్ చూస్తున్నారు.



సాయి పల్లవి తెలుగులో నాగచైతన్యతో కలిసి తండేల్ సినిమా చేస్తోంది. చందూ మొండేటి దర్శకత్వం వహిస్తున్నఈ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతోంది. ఇప్పటికే రిలీజైన గ్లింప్స్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇదికాకుండా త‌మిళంలో శివకార్తికేయన్‌తో కలిసి యాక్షన్ డ్రామా చేస్తోంది. రాజ్ కుమార్ పెరియసామి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను కమల్ హాసన్ నిర్మిస్తున్నాడు. అలాగే నితేశ్ తివారీ తెరకెక్కించనున్న రామాయణం సినిమాలో సీతాదేవి పాత్రలో కనిపించనుంది సాయి పల్లవి. దీనిపై అఫీషియల్ ప్రకటన రావాల్సి ఉంది. సౌత్ ఇండస్ట్రీలో సాయి పల్లవికి మంచి ఫాలోయింగ్ ఉంది. ప్రేమమ్ సినిమాతో నటిగా తెరంగేట్రం చేసి తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకుంది. కంటెంట్, పాత్ర ప్రాధాన్యతను బట్టి సినిమాలను ఎంచుకుంటుంది సాయి పల్లవి.


First Published:  13 Feb 2024 8:51 AM GMT
Next Story