Telugu Global
Cinema & Entertainment

Sai Dharam Tej - ఫ్లాప్ సినిమా నుంచి తప్పించుకున్న సాయితేజ్

Sai Dharam Tej - నాగశౌర్య హీరోగా నటించిన సినిమా ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి. ఈ సినిమా ఇలా రిలీజైందో లేదో అలా సాయిధరమ్ తేజ్ ట్రెండ్ అయ్యాడు. ఎందుకు..?

Sai Dharam Tej - ఫ్లాప్ సినిమా నుంచి తప్పించుకున్న సాయితేజ్
X

దాదాపు ప్రతి హీరో కెరీర్ లో మిస్సయిన సినిమాలుంటాయి. సూపర్ హిట్ సినిమాల్ని మిస్ అయ్యామనే బాధ వాళ్లకు ఉంటుంది. అదే టైమ్ లో ఓ అట్టర్ ఫ్లాప్ సినిమా నుంచి తప్పించుకున్నామనే ఆనందాలు కూడా వాళ్లకుంటాయి. సాయిధరమ్ తేజ్ కెరీర్ లో కూడా ఇలాంటి సినిమా ఉంది.

తాజాగా థియేటర్లలోకి వచ్చింది ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి సినిమా. అవసరాల శ్రీనివాస్ దర్శకత్వంలో నాగశౌర్య హీరోగా తెరకెక్కింది ఈ సినిమా. నిజానికి ఈ సినిమా నాగశౌర్య కంటే ముందు సాయిధరమ్ తేజ్ వద్దకు వెళ్లింది.

శౌర్య కంటే ముందు సాయిధరమ్ తేజ్ కు కథ చెప్పాడు అవసరాల శ్రీనివాస్. కథ మొత్తం విన్న సాయిధరమ్ తేజ్, అందులో నటించనని చెప్పేశాడు. ఆ తర్వాత ఈ కథ నాగశౌర్య వద్దకు వెళ్లింది.

అప్పటికే అవసరాలతో 2 సినిమాలు చేసిన నాగశౌర్య, అతడిపై నమ్మకంతో కావొచ్చు లేదా మొహమాటంతో కావొచ్చు సినిమాలో నటించడానికి ఒప్పుకున్నాడు. ఇప్పుడా ఫలితం వచ్చేసింది. మూవీ ఫ్లాప్ అయింది.

దీంతో ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయిపై సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. ఓ ఫ్లాప్ సినిమా నుంచి సాయిధరమ్ తేజ్ తప్పించుకున్నాడని, మొహమాటానికి పోయి నాగశౌర్య ఫ్లాప్ తెచ్చుకున్నాడని చర్చించుకుంటున్నారు.

First Published:  18 March 2023 4:52 AM GMT
Next Story