Telugu Global
Cinema & Entertainment

SaiDharamTej: కొత్త సినిమా లాంఛ్ చేసిన సాయితేజ్

Sai Dharam Tej: సాయిధరమ్ తేజ్ కొత్త సినిమా ప్రారంభించాడు. మరోసారి నిర్మాత బీవీఎస్ఎన్ బ్యానర్ లోనే నటించబోతున్నాడు. అంతేకాదు, మరో దర్శకుడ్ని పరిచయం చేయబోతున్నాడు.

SaiDharamTej: కొత్త సినిమా లాంఛ్ చేసిన సాయితేజ్
X

హీరో సాయి తేజ్ కొత్త సినిమా స్టార్ట్ చేశాడు. శ్రీ వెంక‌టేశ్వ‌ర సినీ చిత్ర‌ బ్యాన‌ర్‌పై సీనియ‌ర్ నిర్మాత బి.వి.ఎస్‌.ఎన్‌.ప్ర‌సాద్ నిర్మాత‌గా ఈ కొత్త చిత్రం ఈరోజు లాంఛ‌నంగా ప్రారంభమైంది. జ‌యంత్ పానుగంటి ఈ ప్రాజెక్టుతో దర్శకుడిగా పరిచయమౌతున్నాడు.

ముహూర్త‌పు స‌న్నివేశానికి నిర్మాత బాపినీడు భోగ‌వ‌ల్లి కెమెరా స్విచ్ ఆన్ చేశారు. హీరో సాయి తేజ్ క్లాప్ కొట్టాడు. హీరో సాయి తేజ్ తల్లి విజ‌యదుర్గ‌, నిర్మాత బి.వి.ఎస్‌.ఎన్‌.ప్ర‌సాద్ స‌తీమ‌ణి విజ‌య ల‌క్ష్మి పూజా కార్య‌క్ర‌మాల‌ు నిర్వ‌హించారు. దర్శకుడు బుచ్చిబాబుతో పాటు, ప‌లువురు ప్ర‌ముఖులు ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు.

ఈ బ్యానర్ లో సాయితేజ్ ఇప్పటికే పలు సినిమాలు చేశాడు. ప్రస్తుతం ఓ సినిమా సెట్స్ పై కూడా ఉంది. ఇప్పుడు ఇదే బ్యానర్ పై మరో సినిమా స్టార్ట్ చేశాడు. అటు సాయితేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ కూడా ఈ బ్యానర్ పై రెండో సినిమా చేస్తున్నాడు.

ఇక కొత్త సినిమా విషయానికొస్తే, ఇదొక ఫ్యామిలీ ఎంటర్ టైనర్. రెండు కుటుంబాల కథతో సినిమా తెరకెక్కనుంది. హీరోయిన్లు, సంగీత దర్శకుడు ఎవరనే విషయాన్ని త్వరలోనే వెల్లడిస్తారు.

First Published:  2 Dec 2022 2:49 PM GMT
Next Story