Telugu Global
Cinema & Entertainment

Sai Dharam Tej | సాయితేజ్ కెరీర్ లో గోల్డెన్ ఇయర్

Sai Dharam Tej - ఈ ఏడాది సాయిధరమ్ తేజ్ కెరీర్ లో గోల్డెన్ ఇయర్ గా నిలిచింది. దీనికి కారణం విరూపాక్ష సినిమా.

Sai Dharam Tej | సాయితేజ్ కెరీర్ లో గోల్డెన్ ఇయర్
X

మెగా సుప్రీమ్ హీరో సాయి తేజ్, సంయుక్త మీనన్ హీరో హీరోయిన్లగా వచ్చిన సినిమా విరూపాక్ష. కార్తీక్ వర్మ దండు దర్శకత్వం వహించిన ఈ సినిమా సాయి తేజ్ కెరియర్ మొదటి 100 కోట్లు కలెక్ట్ చేసిన సినిమాగా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాలో ముఖ్యపాత్రలు పోషించిన రాజీవ్ కనకాల, సోనియా సింగ్, రవి కృష్ణ. అజినీస్ లోకనాథ్ అందించిన మ్యూజిక్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. 2023 లో రిలీజ్ అయిన మూవీస్ లో థ్రిల్లర్ జానర్లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది విరూపాక్ష.

థియేటర్ లో రిలీస్ అయ్యి బ్లాక్ బస్టర్ గా నిలిచిన విరూపాక్ష నెట్ ఫ్లిక్స్ లో కూడా దుమ్ము లేపింది. నెట్ ఫ్లిక్స్ 2023 సంవత్సరానికి గాను తొలి అర్థభాగానికి చెందిన ఎంగేజ్‌మెంట్ రిపోర్ట్‌లో 8.7 మిలియన్ వాచ్ అవర్స్ (అన్ని లాంగ్వేజెస్ కలిపి) సాధించింది విరూపాక్ష. అలా అటు థియేట్రికల్ గా, ఇటు ఓటీటీ పరంగా సూపర్ హిట్ అందుకున్నాడు సాయిధరమ్ తేజ్.

సాయిధరమ్ తేజ్ కెరీర్ లో 2023 సంవత్సరం గోల్డెన్ ఇయర్. ఎందుకంటే, ఏళ్లుగా సినిమాలు చేస్తున్న ఈ హీరో, ఇప్పటివరకు 100 కోట్ల క్లబ్ లోకి చేరలేదు. ఆ మాటకొస్తే, అతి తక్కువ మంది తెలుగు హీరోలకు మాత్రమే ఈ ఘనత దక్కింది. మిడ్ రేంజ్ హీరోల్లో మరీ తక్కువ. అలాంటి అరుదైన ఘనతను 2023 సంవత్సరంలో సొంత చేసుకున్నాడు తేజు. అందుకే అతడి కెరీర్ కు ఇది గోల్డెన్ ఇయర్.

First Published:  15 Dec 2023 4:55 PM GMT
Next Story