Telugu Global
Cinema & Entertainment

Sai Dharam Tej | గాంజా శంకర్ వచ్చేశాడు

Sai Dharam Tej - బ్రో సినిమా తర్వాత చిన్న గ్యాప్ తీసుకున్న సాయిధరమ్ తేజ్, కొత్త సినిమా ఎనౌన్స్ చేశాడు. సంపత్ నంది దర్శకత్వంలో సినిమా స్టార్ట్ చేశాడు.

Sai Dharam Tej | గాంజా శంకర్ వచ్చేశాడు
X

సుప్రీమ్ హీరోగా పేరు తెచ్చుకున్న సాయి ధరమ్ తేజ్ డిఫరెంట్ కథలు ట్రై చేస్తున్నాడు. స్క్రిప్ట్, దర్శకుడి విజన్ కి తగ్గట్టుగా పాత్ర కోసం చాలా కష్టపడుతున్నాడు. ఇప్పుడు ఆయన పూర్తి మాస్‌ క్యారెక్టర్‌ లో ఓ కమర్షియల్‌ యాక్షన్‌ ఫిల్మ్ చేస్తున్నాడు. దీని పేరు 'గాంజా శంకర్'.

సంపత్ నంది ఈ చిత్రానికి రచన, దర్శకత్వం వహిస్తున్నాడు. బలమైన హీరో పాత్రలు సృష్టించడంలో ఈ దర్శకుడికి మంచి పేరుంది. గాంజా శంకర్ కోసం కూడా అలాంటి ఓ బలమైన పాత్రను క్రియేట్ చేశాడు సంపత్. ఎనౌన్స్ మెంట్ టీజర్ చూస్తే ఈ విషయం అర్థమౌతుంది.

గాంజా శంకర్ లో మంచి లక్షణాల కంటే అవలక్షణాలే ఎక్కువ. అలాంటి వ్యక్తి గంజాయి వ్యాపారంలో ఏం చేశాడు, చివరికి ఏమయ్యాడు అనేది ఈ సినిమా స్టోరీ. తన సృజనాత్మకతో సంపత్ నంది ఈ సినిమాపై అంచనాలు, ఆసక్తి ఏర్పడేలా చేశాడు. సాయి ధరమ్ తేజ్ ఇప్పటిదాకా పూర్తి స్థాయి మాస్ పాత్ర చేయలేదు. గాంజా శంకర్ ఆ లోటు తీరుస్తుంది.

సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్‌ బ్యానర్లపై నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్న ఈ సినిమాను శ్రీకర స్టూడియోస్ సమర్పిస్తోంది. భీమ్స్ సిసిరోలియో ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు.

First Published:  15 Oct 2023 11:20 AM GMT
Next Story