Telugu Global
Cinema & Entertainment

మెగాస్టార్‌కు క్రికెట్ గ్రేట్ శుభాకాంక్షలు

గతంలో చిరంజీవితో కలసి దిగిన ఓ ఫొటోను తన సందేశంతో త్రోబ్యాక్ చిత్రంగా ప్రదర్శించాడు. చిరుగారికి జన్మదిన శుభాకాంక్షలు. ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో విజయపరంపర కొనసాగించాలంటూ సచిన్ తన సందేశం ద్వారా ఆకాంక్షించారు.

మెగాస్టార్‌కు క్రికెట్ గ్రేట్ శుభాకాంక్షలు
X

తెలుగు సినీ దిగ్గజం, మెగాస్టార్ చిరంజీవి 67వ పుట్టిన రోజున వివిధ వర్గాలు, అభిమానుల నుంచి జన్మదిన శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. సినీ, రాజకీయ ప్రముఖుల నుంచి వెటరన్ స్టార్ చిరంజీవి పుట్టినరోజు శుభాకాంక్షలు అందుకోవ‌డం సాధారణ విషయమే. అయితే... భారత క్రికెట్ గ్రేట్ సచిన్ టెండుల్కర్ నుంచి తెలుగు సినిమా గ్రేట్ చిరంజీవి అనూహ్యంగా పుట్టినరోజు శుభాకాంక్షలు అందుకున్నారు. ఆరు పదుల వయసులోనూ కోట్లాది మంది అభిమానులను తన నటనతో అలరిస్తున్న ఎవర్ గ్రీన్ స్టార్ చిరంజీవికి సచిన్ ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. గతంలో చిరంజీవితో కలసి దిగిన ఓ ఫొటోను తన సందేశంతో త్రోబ్యాక్ చిత్రంగా ప్రదర్శించాడు. చిరుగారికి జన్మదిన శుభాకాంక్షలు. ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో విజయపరంపర కొనసాగించాలంటూ సచిన్ తన సందేశం ద్వారా ఆకాంక్షించారు. ఓ కార్యక్రమంలో తాను చిరుతో కలసి బ్లాక్ టీషర్టు, డెనిమ్ జీన్స్ ప్యాంటు ధరించిన ఫొటోను సచిన్ తన సందేశానికి జతచేశాడు.

మరోవైపు..తన 67వ పుట్టినరోజుకు ఒకరోజు ముందే చిరంజీవి నటించిన మల్టీస్టారర్ పాన్ ఇండియా సినిమా..గాడ్ ఫాదర్ టీజర్‌ను విడుదల చేశారు. సల్మాన్ ఖాన్, సత్యదేవ్, నయనతార లాంటి ప్రముఖ నటులతో కలసి గాడ్ ఫాదర్ సినిమాలో చిరంజీవి న‌టించారు. హిందీ, తెలుగు భాషల్లో ఒకేరోజున గాడ్ ఫాదర్ టీజర్ విడుదల చేయటం విశేషం. మలయాళం బ్లాక్ బస్టర్ చిత్రం లూసిఫర్‌కు రీమేక్‌గా గాడ్ ఫాదర్‌ను నిర్మించారు. బాస్‌లకే బాస్‌గా చిరంజీవి నటించారు. ఒక నిముషం 34 సెకన్ల నిడివి కలిగిన ఈ టీజర్‌ను రామ్ చరణ్ తన ఇన్ స్టా గ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. ఈ ఏడాదికే అత్యుత్తమ టీజర్‌గా అభివర్ణించాడు. అక్టోబర్ 5న దసరా కానుకగా గాడ్ ఫాదర్ సినిమా అభిమానుల ముందుకు రానుంది.

First Published:  22 Aug 2022 1:45 PM GMT
Next Story