Telugu Global
Cinema & Entertainment

Salaar Teaser | సలార్ మూవీ టీజర్ డేట్ ఫిక్స్

Salaar Movie Teaser: ప్రభాస్ నుంచి మరో మూవీ రెడీ అయింది. మరో 3 రోజుల్లో సలార్ టీజర్ రాబోతోంది.

Salaar | ఒక్క ఎపిసోడ్ కోసం 750 వాహనాలు
X

Salaar | ఒక్క ఎపిసోడ్ కోసం 750 వాహనాలు

Salaar Teaser | ఆదిపురుష్ హంగామా ముగిసింది. ఫ్లాప్ ముద్ర వేయించుకుంది. ఇప్పుడు ప్రభాస్ నుంచి మరో సినిమా రెడీ అవుతోంది. అదే సలార్. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతోంది ఈ సినిమా.

తాజాగా సలార్ టీజర్ రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేశారు. 6వ తేదీ ఉదయం 5 గంటల 12 నిమిషాలకు సలార్ సినిమా టీజర్ ను రిలీజ్ చేయబోతున్నారు. హోంబలే ఫిలిమ్స్ అధికారిక యూట్యూబ్ ఛానెల్ లో ఈ టీజర్ ను రిలీజ్ చేస్తారు.

సలార్ పై భారీ అంచనాలున్నాయి. దీనికి ఓ కారణం ప్రభాస్ అయితే, మరో ప్రధాన కారణం ప్రశాంత్ నీల్. కేజీఎఫ్ ఛాప్టర్-1, ఛాప్టర్-2 లాంటి 2 బ్లాక్ బస్టర్స్ తర్వాత నీల్ నుంచి వస్తున్న సినిమా ఇది.

శృతిహాసన్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుండగా, సంజయ్ దత్ విలన్ గా కనిపించబోతున్నాడు. సలార్ కోసం ఓ సరికొత్త ప్రపంచాన్ని సృష్టించాడు ప్రశాంత్ నీల్. సెప్టెంబర్ 28న ఈ సినిమా థియేటర్లలోకి వస్తోంది.

First Published:  3 July 2023 11:32 AM GMT
Next Story