Telugu Global
Cinema & Entertainment

శాకినీ డాకినీ రిలీజ్ డేట్ ఫిక్స్

నివేత థామస్, రెజీనా కలిసి చేస్తున్న రీమేక్ ప్రాజెక్టు శాకినీ-డాకినీ. ఈ సినిమా ఫస్ట్ కాపీ రెడీ అయింది. తాజాగా రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు.

శాకినీ డాకినీ రిలీజ్ డేట్ ఫిక్స్
X

'ఓ బేబీ' లాంటి సూపర్ హిట్ తర్వాత సురేష్ ప్రొడక్షన్స్, గురు ఫిలిమ్స్, క్రాస్ పిక్చర్స్ బ్యానర్స్ పై వస్తున్న సినిమా శాకినీ డాకినీ. దక్షిణ కొరియాలో సూపర్ హిట్టయిన యాక్షన్-కామెడీ సినిమా మిడ్ నైట్ రన్నర్స్ కు ఇది అధికారిక రీమేక్. అందుకే నిర్మాతగా థామస్ కిమ్ పేరును కూడా చేర్చారు.

రెజీనా, నివేత థామస్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాకు సుధీర్ వర్మ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పుడీ సినిమాకు రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. శాకిని డాకిని సెప్టెంబర్ 16న థియేటర్లలో విడుదల కానుంది.

రిలీజ్ డేట్ పోస్టర్‌లో డేర్‌డెవిల్ లేడీస్ రెజీనా, నివేద సీరియస్ లుక్ ఇంటెన్స్ గా ఉంది. టైటిల్ మధ్య అక్షరాలకు పింక్ కలర్ ఇవ్వడం, పోస్టర్ లో ఆ పింక్ లైట్ రెజీనా, నివేదపై పడటం ఆసక్తికరంగా ఉంది.

సినిమాలో నివేత థామస్ పేరు షాలినీ. రెజీనా పేరు దామిని. షామిలీ శాకినీగా, దామిని డాకినీగా ఎందుకు మారాల్సి వచ్చింది.. అలా రెబల్స్ గా మారిన ఈ ఇద్దరు అమ్మాయిలు ఏం సాధించారనేది ఈ సినిమా స్టోరీ.

ఈ చిత్రానికి రిచర్డ్ ప్రసాద్ కెమెరామెన్‌గా, మిక్కీ మెల్క్రెరీ సంగీత దర్శకుడుగా, విప్లవ్ నైషధం ఎడిటర్ గా పని చేస్తున్నారు.

First Published:  18 Aug 2022 5:43 AM GMT
Next Story