Telugu Global
Cinema & Entertainment

శాకినీ డాకినీ టీజర్ రివ్యూ

శాకినీ డాకినీ మూవీ ప్రమోషన్స్ ఊపందుకున్నాయి. ఈరోజు టీజర్ రిలీజ్ చేశారు. ఆ టీజర్ ఎలా ఉందో చూద్దాం.

శాకినీ డాకినీ టీజర్ రివ్యూ
X

సురేష్ ప్రొడక్షన్స్, గురు ఫిలిమ్స్, క్రాస్ పిక్చర్స్ బ్యానర్స్ పై సౌత్ కొరియా యాక్షన్-కామెడీ చిత్రం 'మిడ్‌నైట్ రన్నర్స్' కు అధికారిక రీమేక్ గా నిర్మాతలు డి.సురేష్ బాబు, సునీత తాటి నిర్మిస్తున్న చిత్రం 'శాకిని డాకిని' విడుదలకు సిద్ధమౌతోంది. రెజీనా, నివేదా థామస్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రాన్ని సుధీర్ వర్మ డైరక్ట్ చేశాడు.

రెజీనా, నివేదాలను పోలీస్ అకాడమీలో ట్రైనీలుగా పరిచయం చేస్తూ శాకిని డాకిని టీజర్ విడుదలైంది. టీజర్ చాలా ఆసక్తికరంగా ఉంది. నివేద భోజన ప్రియురాలు కాగా, రెజీనాకు ఓసీడీ సమస్య ఉంది. అలాగే ట్రైనింగ్ లో వీరిద్దరూ వెనకబడ్డారు. పైగా అనవసరమైన గొడవల జోలికి వెళ్తారు. టీజర్ లో అమ్మాయి తలపై ఒక క్రిమినల్ రాడ్డుతో కొట్టడం, తర్వాత రెజీనా, నివేద చేసిన కొన్ని యాక్షన్ స్టంట్స్ అసలు కథపై ఆసక్తిని పెంచాయి.

టీజర్‌ను బట్టి చూస్తే.. 'శాకిని డాకిని' ఎంటర్ టైన్మెంట్, యాక్షన్, బలమైన కథ, డ్రామాతో కూడిన సినిమా అని అర్ధమౌతోంది. రెజీనా, నివేదా పాత్రలు బ్రిలియంట్ గా ఉన్నాయి. కొన్ని సన్నివేశాలలో డేర్‌డెవిల్స్‌గా కనిపించడం ఆకట్టుకుంది. థ్రిల్లర్స్ ను హ్యాండిల్ చేయడంలో దిట్ట అయిన దర్శకుడు సుధీర్ వర్మ.. ఈ సబ్జెక్ట్‌ని డీల్ చేయడంలో తనదైన మార్క్ చూపించే ఉంటాడు.

నిర్మాతలు ముందుగా ప్రకటించినట్లుగా, 'శాకిని డాకిని' సినిమా సెప్టెంబర్ 16న థియేటర్లలో విడుదల కానుంది.



First Published:  23 Aug 2022 2:56 PM GMT
Next Story