Telugu Global
Cinema & Entertainment

సముద్రంలో ఇంటర్వెల్?

ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ లో రాబోతున్న సినిమాపై ఇప్పుడు ఫ్రెష్ గా మరో ప్రచారం ఊపందుకుంది. ఈసారి ఇంటర్వెల్ బ్యాంగ్ పై కథనాలు వస్తున్నాయి. ఇంతకీ ఏంటా మేటర్?

సముద్రంలో ఇంటర్వెల్?
X

ఎన్టీఆర్ కొత్త సినిమాకు సంబంధించి రోజుకో పుకారు షికారు చేస్తోంది. కొరటాల శివ దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే ఎన్నో ఊహాగానాలు మార్కెట్లో వినిపిస్తున్నాయి. వాటికి జతగా ఇప్పుడు మరో కథనం వచ్చి చేరింది. ఇది సినిమాలో ఇంటర్వెల్ బ్యాంగ్ కు సంబంధించిన ప్రచారం.

ఎన్టీఆర్-కొరటాల కాంబోలో పాన్ ఇండియా ప్రాజెక్టుగా రాబోతున్న ఈ సినిమాలో ఇంటర్వెల్ బ్యాంగ్ నభూతో.. అనే రేంజ్ లో ఉంటుందట. ఈ ఇంటర్వెల్ సీక్వెల్ ను సముద్రం బ్యాక్ డ్రాప్ లో ప్లాన్ చేశారట. ఇంకా చెప్పాలంటే, సముద్రంలో పడవల మధ్య ఇంటర్వెల్ ట్విస్ట్ తో పాటు, భారీ ఫైట్ ఉంటుందట. ఇప్పటివరకు తెలుగుతెరపై ఇలాంటి బ్యాంగ్ రాలేదనేది ఇంటర్నల్ టాక్.

తన కొత్త సినిమా కోసం ఎన్టీఆర్ ప్రస్తుతం మేకోవర్ పనిలో పడ్డాడు. ఈ సినిమాలో 2 లుక్స్ ఉంటాయంటున్నారు. ఒక లుక్ కోసం కాస్త భారీకాయంతో, మరో లుక్ కోసం స్లిమ్ గా కనిపించాలంటున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ ఈ పని మీద ఉన్నాడంటూ కథనాలు వినిపిస్తున్నాయి.

తాజా సమాచారం ప్రకారం ఈనెలాఖరుకు ఈ సినిమా సెట్స్ పైకి వస్తుంది. ఆర్ఆర్ఆర్ లాంటి ఎపిక్ మూవీ తర్వాత ఎన్టీఆర్ నుంచి వస్తున్న సినిమా ఇదే కావడంతో భారీ అంచనాలున్నాయి. ఆ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా, కొరటాల ఈ సినిమాను సిద్ధం చేయబోతున్నాడు. లాంఛింగ్ రోజున మరిన్ని వివరాలు బయటకు రాబోతున్నాయి.

First Published:  21 Aug 2022 8:35 AM GMT
Next Story