Telugu Global
Cinema & Entertainment

Raviteja | మరో హీరోయిన్ ను పరిచయం చేస్తున్న మాస్ రాజా

Raviteja - హరీశ్ శంకర్ దర్శకత్వంలో చేస్తున్న సినిమాతో ఓ హీరోయిన్ ను పరిచయం చేస్తున్నాడు రవితేజ. ఇప్పుడు మరో కొత్త సినిమాతో, ఇంకో హీరోయిన్ ను పరిచయం చేయబోతున్నాడు.

Raviteja | మరో హీరోయిన్ ను పరిచయం చేస్తున్న మాస్ రాజా
X

హీరోయిన్లను పరిచయం చేయడం రవితేజకు కొత్త కాదు. తన ప్రతి సినిమాతో ఓ కొత్తమ్మాయిని పరిచయం చేయాలని అనుకుంటాడు ఈ హీరో. ఇప్పటికే ఖిలాడీ, టైగర్ నాగేశ్వరరావు లాంటి సినిమాలతో కొత్తమ్మాయిలను పరిచయం చేసిన రవితేజ, ఇప్పుడు మరో ముద్దుగుమ్మకు ఛాన్స్ ఇచ్చాడు.

త్వరలోనే అనుదీప్ కెవి దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు రవితేజ. జాతిరత్నాలతో గుర్తింపు తెచ్చుకున్న అనుదీప్, తన మూడో చిత్రంగా మాస్ రాజాతో ఈ సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్ గా రుక్మిణి వసంత్ ను తీసుకున్నారు.

కన్నడలో వచ్చిన సూపర్ హిట్ మూవీ సప్తసాగరాలు దాటి సినిమాలో హీరోయిన్ గా నటించింది రుక్మిణి వసంత్. తన లుక్స్ తో ఆమె తెలుగు ఆడియన్స్ ను కూడా ఎట్రాక్ట్ చేసింది. దీంతో ఆమెకు రవితేజ సినిమాలో ఛాన్స్ వచ్చింది.

విజయ్ దేవరకొండ, గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్ లో వస్తున్న సినిమా కోసం కూడా రుక్మిణి వసంత్ పేరును పరిశీలిస్తున్నారు. అంతకంటే ముందే రవితేజ, ఈ ముద్దుగుమ్మ పేరును అధికారికంగా ప్రకటించాడు.

First Published:  21 Jan 2024 5:35 PM GMT
Next Story