Telugu Global
Cinema & Entertainment

RRR Japan - జపాన్ లో కూడా సూపర్ హిట్టయిన ఆర్ఆర్ఆర్

RRR super hit in Japan - RRR మూవీ జపాన్ లో కూడా హిట్ అయింది.

RRR Japan - జపాన్ లో కూడా సూపర్ హిట్టయిన ఆర్ఆర్ఆర్
X

ఆర్ఆర్ఆర్ సినిమా జపాన్ లో కూడా సూపర్ హిట్టయింది. చాన్నాళ్ల కిందటే రిలీజైన ఈ మూవీ, ఇప్పటికీ జపాన్ లో మంచి వసూళ్లతో నడుస్తోంది. ఇప్పటివరకు ఈ సినిమాకు జపాన్ లో 120 కోట్ల రూపాయల వసూళ్లు వచ్చాయి. మరో 50 కోట్ల వరకు రావొచ్చని అంచనా వేస్తోంది.


జపాన్ లో ఆర్ఆర్ఆర్ వసూళ్లను అంతర్జాతీయ ట్రేడ్ ఎనలిస్టులు పొగుడుతున్నారు. ఆ దేశంలో పరభాషా చిత్రాలు చాలా తక్కువగా హిట్ అవుతుంటాయి. ఇప్పుడా లిస్ట్ లోకి ఆర్ఆర్ఆర్ చేయడం నిజంగా గొప్ప విషయం అంటున్నారు. ఇప్పటికీ జపాన్ లో ఆర్ఆర్ఆర్ కు ఫుట్ ఫాల్ తగ్గలేదంట.


జపాన్ విడుదల కోసం ప్రత్యేకంగా ప్రచారం చేసింది ఆర్ఆర్ఆర్ టీమ్. రాజమౌళి కొన్ని ఇంటర్వ్యూలు ఇవ్వడంతో పాటు.. స్వయంగా చరణ్-తారక్ తో కలిసి టోక్యోలో ప్రచారం నిర్వహించాడు. ఈ ప్రచారం ఆర్ఆర్ఆర్ సినిమాకు బాగా పనికొచ్చింది.


అలియాభట్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా హిట్టయి సంగతి తెలిసిందే. అంతేకాదు, ఇందులోని నాటు-నాటు పాటకు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ అవార్డ్ సైతం వచ్చింది. కీరవాణి ఈ సినిమాకు సంగీత దర్శకుడు.

First Published:  19 May 2023 10:45 AM GMT
Next Story