Telugu Global
Cinema & Entertainment

RRR Naatu Naatu: గోల్డెన్ గ్లోబ్ లో మెరిసిన ఆర్ఆర్ఆర్

'RRR' 'Naatu Naatu': తెలుగు పాటకు దక్కిన అపూర్వ గౌరవం ఇది. ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటునాటు పాటకు ప్రతిష్టాత్మక గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ దక్కింది.

RRR Naatu Naatu: గోల్డెన్ గ్లోబ్ లో మెరిసిన ఆర్ఆర్ఆర్
X

ఆర్ఆర్ఆర్ సినిమాకు గోల్డెన్ గ్లోబ్ అవార్డుల్లో సముచిత స్థానం దక్కింది. 80వ గోల్డెన్ గ్లోబ్ అవార్డుల్లో ఈ సినిమా మెరిసింది. నాటు నాటు పాటకు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ దక్కింది. ఓ తెలుగు పాటకు అంతర్జాతీయ స్థాయిలో ఈ గౌరవం దక్కింది.

నాటు నాటు పాట సృష్టికర్త ఎంఎం కీరవాణి, వేదిక ఎక్కి సగర్వంగా గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ అందుకున్నారు. తనను నమ్మి, తన వెన్నంటే ఉండి ప్రోత్సహిస్తున్న రాజమౌళికి సభాముఖంగా కృతజ్ఞతలు చెప్పుకున్నారు. పాటలో చరణ్-తారక్ కష్టపడి డాన్స్ చేశారని మెచ్చుకున్నారు. వీళ్ల ముగ్గురికి ఈ అవార్డ్ ను అంకితం చేశారు.

నాటు నాటు పాటను చంద్రబోస్ రచించాడు. రాహుల్ సింప్లిగంజ్, కాలభైరవ కలిసి ఆలపించారు. ప్రేమ్ రక్షిత్ కొరియోగ్రఫీ అందించిన ఆ పాటలోని స్టెప్పులు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాయి. చరణ్-తారక్ వేసిన సింక్ స్టెప్ కు ఇంటర్నేషనల్ ఆడియన్స్ జేజేలు పలికారు.

అలా చాన్నాళ్లుగా హాట్ టాపిక్ గా నలిగిన ఈ పాట, అందరి అంచనాల్ని నిజం చేస్తూ, గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ దక్కించుకుంది. ఈ అవార్డు అందుకోవడంతో, ఆస్కార్ బరిలో ఆర్ఆర్ఆర్ సినిమా మరింత ముందుకెళ్లిందని చెప్పొచ్చు. ఎందుకంటే, గోల్డెన్ గ్లోబ్ లో అవార్డ్ అందుకున్న చాలా చిత్రాలకు ఆస్కార్ అవార్డులు కూడా దక్కిన సందర్భాలున్నాయి.



First Published:  11 Jan 2023 3:12 AM GMT
Next Story