Telugu Global
Cinema & Entertainment

RRR Movie: పఠాన్ కు పోటీగా ఆర్ఆర్ఆర్

RRR Movie: ఆర్ఆర్ఆర్ మూవీ బాక్స్ ఆఫీసు హవా ముగిసింది. ఈ విషయం అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడీ మూవీ మళ్ళీ రిలీజ్ అవుతోంది.

RRR Movie: పఠాన్ కు పోటీగా ఆర్ఆర్ఆర్
X

RRR Movie: పఠాన్ కు పోటీగా ఆర్ఆర్ఆర్

షారుఖ్ ఖాన్ నటించిన "పఠాన్" భారతదేశంలో భారీ బ్లాక్ బస్టర్ గా నిలవడమే కాకుండా అంతర్జాతీయంగా బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తోంది. ఇప్పటికే వివిధ దేశాల్లో ఎన్నో రికార్డులు నెలకొల్పింది.


"బాహుబలి 2" తర్వాత, అమెరికాలో పఠాన్ దే హవా. ఇప్పటివరకు ఈ సినిమా యూఎస్ఏలో దాదాపు 17 మిలియన్ డాలర్లు వసూలు చేసింది, ఇది ఆల్ టైమ్ అత్యధిక వసూళ్లు చేసిన భారతీయ చిత్రంగా రెండో స్థానంలో నిలిచింది. 20 మిలియన్ డాలర్లతో "బాహుబలి 2" అగ్రస్థానంలో నిలిచింది.


మరోవైపు రాజమౌళి తీసిన ఆర్ఆర్ఆర్ సినిమా, 14.3 మిలియన్ డాలర్లు వసూలు చేసింది. అయితే, ఆస్కార్‌కి వచ్చే సమయానికి, ఓవర్సీస్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ వేరియెన్స్ ఫిల్మ్స్ యునైటెడ్ స్టేట్స్‌లో ఆర్ఆర్ఆర్ ని మరోసారి రీ-రిలీజ్ చేస్తోంది. ఈసారి ఏకంగా 200 థియేటర్లలో రీ-రిలీజ్ అవుతోంది ఆర్ఆర్ఆర్.


ఆస్కార్ కు నామినేట్ అవ్వడంతో, రీ-రిలీజ్‌లో ఆర్ఆర్ఆర్ కు మరిన్ని వసూళ్లు వస్తాయని భావిస్తున్నారు. మరో 3 మిలియన్ డాలర్లు వసూలు చేసి "పఠాన్" టోటల్ కలెక్షన్లను క్రాస్ చేస్తుందని కొందరు అభిమానులు అంచనా వేస్తున్నారు. మరి ఆర్ఆర్ఆర్,

"పఠాన్"ను అధిగమించి రెండో అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రంగా నిలుస్తుందా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్.

First Published:  24 Feb 2023 10:18 AM GMT
Next Story